Horoscope Today: ఈరోజు ఈ రాశివారు ఏ పని చేపట్టినా సక్సెస్.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

|

Feb 07, 2022 | 6:49 AM

Zodiac signs: ప్రతి ఒక్కరికి భిన్నమైన స్వభావం ఉంటుంది. వినయం, దయ, నిజాయితీ, న్యాయం చేయడంలో నైపుణ్యం, ఈ లక్షణాలన్నింటినీ కలిగి ఉండటం..

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు ఏ పని చేపట్టినా సక్సెస్.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Follow us on

Zodiac signs: ప్రతి ఒక్కరికి భిన్నమైన స్వభావం ఉంటుంది. వినయం, దయ, నిజాయితీ, న్యాయం చేయడంలో నైపుణ్యం, ఈ లక్షణాలన్నింటినీ కలిగి ఉండటం ( Astro Tips ) ఏ వ్యక్తిలోనైనా గొప్ప విషయం. ప్రతిభ, విశ్వాసం మాత్రమే కాకుండా, దయ, ఎదుటివారికి సాయం చేసే గుణం ఉన్న వ్యక్తి ఈరోజు బహు అరుదు. అయితే ఏ రాశి వారి ఎలా ఉందో తెలుసుకుందాం..

మేషం

ఇష్టకార్యసిద్ధి ఉంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్య నిర్ణయాల్లో అనుభవజ్ఞుల సలహాలు తప్పనిసరి. ఆర్థికంగా శుభఫలితాలున్నాయి. మీరు మీ వృత్తి జీవితంతో పాటు మీ వ్యక్తిగత జీవితంపై పూర్తి శ్రద్ధ వహించాలి.

వృషభం

ఈ రాశి వారు చేపట్టే పనుల్లో శ్రమపెరుగుతుంది. బంధుమిత్రులతో పొరపొచ్చాలు రాకుండా చూసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీరు చేయని పొరపాటుకు నింద పడాల్సి వస్తుంది. అపార్ధాలకు తావులేకుండా వ్యవహరించాలి.

మిథునం

మొదలు పెట్టిన పనులను పూర్తిచేస్తారు. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. మనస్సు చెప్పింది చేయండి శుభం చేకూరుతుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకోనందుకు మీ స్నేహితులకు కోపం రావచ్చు.

కర్కాటకం

మీ మీ రంగాల్లో మిశ్రమ వాతావరణం ఉంది. బలమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. తప్పుదోవ పట్టించేవారున్నారు జాగ్రత్త. చంచల బుద్ధితో సమస్య ప్రారంభమవుతుంది. సమయానికి సరైన ఆహార నియమాలను పాటించాలి. మీ వ్యక్తిగత జీవితం గురించి ఎవరితోనూ మాట్లాడకండి. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం గురించి మీరు చాలా భావోద్వేగంగా ఉండవచ్చు.

సింహం

ఈ రాశి వారికి విశేషమైన శుభఫలితాలున్నాయి. మీ మీ రంగాల్లో జయకేతనం ఎగురవేస్తారు. బుద్ధిబలం బాగుంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఒక శుభవార్త వింటారు. అధికారుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. అష్టలక్ష్మీదేవి సందర్శనం శుభప్రదం. ఆరోగ్య పరంగా అంతా మెరుగ్గా ఉంటుంది.

కన్య

వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో శ్రమ ఫలిస్తుంది. సమయస్పూర్తితో ఆటంకాలు తొలుగుతాయి. ముఖ్య విషయాల్లో చంచల స్వభావాన్ని రానీయకండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈ రోజు సామాజిక సేవ చేస్తున్న పిల్లవాడిని చూసి మనసులో ఆనందం కలుగుతుంది.

తుల

ఈ రాశి వారు అనుకున్నది సాధిస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబసభ్యులకు మంచి జరుగుతుంది. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. ఇష్టదైవ ప్రార్థన వల్ల మేలు జరుగుతుంది. విద్యార్థులకు మంచి రోజు.

వృశ్చికం

ఎన్ని ఇబ్బందులు వచ్చినా పోరాడి అనుకున్నది సాధిస్తారు. మనోబలంతో ముందుకుసాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. స్థిర ఆస్తుల కొనుగోలు, అమ్మకం ఉండవచ్చు.

ధనుస్సు

ఈ రాశి వారికి ధనలాభం కలదు. వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని అందుకుంటారు. విందు వినోదాల్లో సంతోషంగా గడుపుతారు. నూతన కార్యాలు ప్రారంభించే ముందు సాధ్యసాధ్యాలను దృష్టిలో పెట్టుకొవాలి. దుర్గ ఆరాధన చేయాలి. అవసరమైన వస్తువులను మాత్రమే కొనుగోలు చేయండి.

మకరం

మీ మీ రంగాల్లో ఆచి తూచి ముందుకు సాగాలి. ముఖ్య విషయాల్లో జాప్యం వద్దు. ఒకటి ఊహిస్తే మరొకటి అవుతుంది, చెడు ఆలోచనలను దరిచేరనీయకండి. నవగ్రహ శ్లోకాలను చదవండి.

కుంభం

అనవసర ఖర్చులు జరిగే అవకాశం ఉంది. కొన్ని సంఘటనలు మనోవిచారాన్ని కలిగించే విధంగా ఉంటాయి. అనవసర వివాదాలలో తలదూర్చకండి. మంచి మనస్సుతో ముందుకు సాగండి కష్టాలు తగ్గుతాయి. రియల్ ఎస్టేట్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు గొప్ప విజయాన్ని పొందవచ్చు.

మీనం

ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారమవుతుంది. సమయానికి సహాయం చేసేవారున్నారు. కీలక వ్యవహారాల్లో విజయసిద్ధి ఉంది. లక్ష్మీధ్యానం చేయాలి. అపరిచితులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)