Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు

| Edited By: Janardhan Veluru

Oct 29, 2024 | 5:01 AM

Today Horoscope (29th Oct 2024): మేష రాశి వారి ఆదాయం ఈ రోజు బాగా వృద్ధి చెందుతుంది. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగా మెరుగుపడే అవకాశముంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు మంచి ఉద్యోగ యోగం పడుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 29th October 2024
Follow us on

దిన ఫలాలు (అక్టోబర్ 29, 2024): మేష రాశికి చెందిన నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగా మెరుగుపడుతుంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు మంచి ఉద్యోగ యోగం పడుతుంది.మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ధన సంపాదనకు సంబంధించిన వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. కొద్ది శ్రమతో ముఖ్యమైన పనులన్నిటినీ పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. బంధుమిత్రుల నుంచి ఆదరణ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆటుపోట్లు దాదాపు పూర్తిగా తొలగిపోతాయి. ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కొన్ని ముఖ్యమైన దీర్ఘకాలిక రుణ సమస్యలు తగ్గుతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. అధికారులకు మీ మీద నమ్మకం బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో శ్రమ తక్కువ ఫలితం ఎక్కువగా ఉంటుంది. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. అనుకున్న పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగా మెరుగుపడుతుంది. పెళ్లి ప్రయత్నాలు, ప్రేమ వ్యవహారాలు సానుకూలపడతాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండకపోవచ్చు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా, అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాల మీద దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులు, వ్యవహారాలన్నీ మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ యోగం పడుతుంది. పెళ్లి ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి. అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

కుటుంబ వ్యవహారాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు శుభ వార్తలు అందుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబపరంగా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వాహన యోగం పడుతుంది. చేపట్టిన పనులు, వ్యవహారాల్లో అవరోధాలు ఉన్నా వాటిని సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో సఖ్యత బాగా పెరుగుతుంది. సోదరులతో స్థిరాస్తి వ్యవహారం ఒకటి పరిష్కారమవుతుంది. వృత్తి, వ్యాపా రాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబ జీవితం సాఫీగా గడిచిపో తుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో అదనపు పని భారం తప్పకపోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ కాస్తంత ఎక్కువగానే ఉన్నప్పటికీ ప్రతిఫలానికి లోటుండదు. ఆదాయ మార్గాల మీద శ్రద్ద పెంచుతారు. కుటుంబ జీవితంలో కొద్దిపాటి మార్పులు చోటు చేసుకుంటాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఖర్చులను మించిన ఆదాయం ఉంటుంది. ఇంటా బయటా మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. కుటుంబంతో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆదాయ వ్యవహారాలు బాగా ఉత్సాహం కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఇంటా బయటా పలుకుబడి పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాలలో సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందు తాయి. కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని వివాదాలు, సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు ఉండ వద్దు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాలలో శ్రమ, ఒత్తిడి కాస్తంత ఎక్కువగానే ఉంటాయి. ఓర్పు సహనాలతో వ్యవహరిం చడం మంచిది. వ్యాపారాలు నిదానంగా, నిలకడగా సాగిపోతాయి. కొద్దిగా అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అవసరానికి తగ్గట్టుగా చేతికి డబ్బు అందుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు ఆశిం చిన సమాధానం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆధ్యాత్మిక విష యాలపై శ్రద్ద పెరుగుతుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. అనుకున్న పనులన్నీ పూర్తవు తాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆదాయ మార్గాల మీద శ్రద్ద పెరుగుతుంది. ధనపరంగా మరింత పురోగతి కలుగుతుంది. ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. కార్యకలాపాలు, లావాదేవీలు కొద్దిగా వృద్ధి చెందుతాయి. సొంత ఇంటి కోసం ప్రయత్నాలు ప్రారంభి స్తారు. చేపట్టిన పనులన్నిటినీ కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో సకాలంలో పూర్తి చేస్తారు. సమా జంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఎదురుచూస్తున్న సమాచారం అందుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఇంటా బయటా పలుకుబడి బాగా పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఉద్యో గంలో మీ పనితీరుకు, సమర్థతకు ప్రశంసలు లభిస్తాయి. ఇంట్లో శుభకార్యాలకు ప్లాన్ చేస్తారు. ఇష్టమైన బంధుమిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు అవకాశాలు పెరుగుతాయి. ఆదాయానికి లోటుండదు కానీ కుటుంబ ఖర్చులు బాగా పెరుగు తాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ప్రతి కీలక విషయంలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది. వ్యయప్రయాసలతో గానీ ఏ పనీ పూర్తి కాదు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది కానీ, నిరర్థక ఖర్చులు పెరుగుతాయి. వివాదా లకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఉద్యోగ వాతావరణం ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులు కొత్త ఆఫర్లు అందుతాయి. కుటుంబ సమేతంగా దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో కొన్ని సమస్యల్ని అధిగమిస్తారు. సహోద్యోగులకు వీలైనంతగా సహాయ సహకారాలు అందిస్తారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల ఫలితాలనిస్తాయి. ధనపరంగా బాగానే ఉంటుంది. రావలసిన డబ్బు వసూలవుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. బంధుమిత్రుల నుంచి ఆశించిన సహాయం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో సొంత ఆలోచనలు మంచివి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగు తుంది.