Horoscope Today: ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.. ఆదివారం రాశిఫలాలు..

|

Nov 28, 2021 | 7:57 AM

Today Horoscope: చాలా సందర్భాల్లో మనం ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ఇబ్బందుల్లో పడుతుంటాం. అందుకే కొత్త పనులను మొదలు పెట్టాలన్నా,

Horoscope Today: ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.. ఆదివారం రాశిఫలాలు..
Horoscope Today
Follow us on

Today Horoscope: చాలా సందర్భాల్లో మనం ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ఇబ్బందుల్లో పడుతుంటాం. అందుకే కొత్త పనులను మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా.. జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు. కావున ఆదివారం (నవంబర్ 28న ) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో.. ఓసారి తెలుసుకుందాం..

మేషం: ఈ రోజు ఈ రాశివారు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అయినప్పటికీ ధైర్యంతో అధిగమిస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. పెద్దలు, కుటుంబసభ్యుల సలహాలు తీసుకుంటే మంచిది.

వృషభం: ఈ రాశి వారు చేపట్టిన పనులు త్వరగా పూర్తవుతాయి. ఒక ఘటన మానసిక శక్తిని పెంచుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. విందు వినోదాల్లో పాల్గొంటారు.

మిథునం: ఈ రోజు శుభకాలం. ఉత్సాహవంతంగా అందరితో గడుపుతారు. గతంలో ఆగిన పనులు పూర్తవుతాయి. ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

కర్కాటకం: ఈ రాశి వారికి శ్రమ పెరిగినప్పటికీ.. పనులు సకాలంలో పూర్తవుతాయి. అన్ని రంగాల వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అవసరానికి తగిన ఆర్థిక సహాయం అందుతుంది. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి.

సింహం: ఈ రాశి వారికి మంచి ఫలితాలున్నాయి. సకాలంలో పనులు పూర్తవుతాయి. కీలక వ్యవహారంలో జాగ్రత్తలు అవసరం. ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కన్య: ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. కీలక నిర్ణయాల్లో జాగ్రత్తలు అవసరం. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆర్థిక సాయం అందుతుంది.

తుల: ఈ రాశివారికి శుభకాలం. అవసరానికి ఆర్థికసాయం అందుతుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. పెద్దలు సలహాలు, సూచనలు మేలు చేస్తాయి.

వృశ్చికం: ఈ రాశివారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారమవుతుంది. సమయానికి ఆర్థిక సాయం అందుతుంది.

ధనుస్సు: చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కొందరి ప్రవర్తన ఇబ్బందులను కలిగిస్తుంది. కాస్త నిరుత్సాహం ఎదురైనప్పటికీ.. ధైర్యంతో ముందుకుసాగాలి. గొడవలకు దూరంగా ఉండాలి.

మకరం: ఈ రాశివారు చేపట్టే పనుల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. సన్నిహితుల సాయంతో ఆటంకాలను అధిగమిస్తారు.

కుంభం: ఈ రోజు శుభకాలం. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. పలు వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

మీనం: ఈ రాశిశారు చేపట్టే పనుల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మొహమాటం మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తుంది. బంధువులతో గొడవలకు దూరంగా ఉండాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.

Also Read:

Gold Price Today: భగ్గుమంటున్న బంగారం ధరలు.. తాజాగా 10 గ్రాములపై ఎంత పెరిగిందంటే..!

Sabarimala Temple: అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. వారికి కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ అవసరం లేదు..