Horoscope Today: ఈ రాశివారికి వ్యాపారాలలో ఇబ్బందులు తప్పవు.. బకాయిలు వసూలు అవుతాయి.. సంఘంలో గుర్తింపు

| Edited By: Anil kumar poka

Jun 28, 2021 | 10:46 AM

Horoscope Today: ప్రస్తుత ఆధునిక కాలంలోనూ.. చాలా మంది తమ భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అందులో ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించేవారు..

Horoscope Today: ఈ రాశివారికి వ్యాపారాలలో ఇబ్బందులు తప్పవు.. బకాయిలు వసూలు అవుతాయి.. సంఘంలో గుర్తింపు
Rasi Phalalu
Follow us on

Horoscope Today: ప్రస్తుత ఆధునిక కాలంలోనూ.. చాలా మంది తమ భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అందులో ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించేవారు ఎక్కువగానే ఉన్నారు. తమ రోజు ఎలా ఉండబోతుంది.. ఎలాంటి పనులు మొదలు పెట్టాలి.. అని తెలుసుకోవడానికి చాలా మంది ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఇందులో భాగంగానే జూన్‌ 28న రాశిఫలాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకుందాం.

​మేషరాశి

నిరుద్యోగులు ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరులతో కలిసి కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో కలిసి వస్తాయి. శివాభిషేకం మేలు చేస్తుంది.

​వృషభరాశి

స్నేహితుల నుంచి మంచి వార్తలు వింటారు. బకాయిలు వసూళ్ల విషయంలో కాస్త ఆలస్యం జరిగే అవకాశాలున్నాయి. పెట్టుబడుల విషయాలలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అష్టలక్ష్మీ పారాయణం మేలు చేస్తుంది.

మిథున రాశి

కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. ఇతరులతో వ్యవహారిక విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. దుర్గ అమ్మవారి పూజ ఎంతో మేలు చేస్తుంది.

కర్కాటక రాశి

అనవసరమైన కార్యక్రమాల్లో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వ్యాపారం విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. లక్ష్మీ గణపతి స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

సింహ రాశి

వ్యాపార విషయంలో రావాల్సిన బాకీలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విష్ణు సహాస్ర నామ పారాయణం ఎంతో మేలు చేస్తుంది.

కన్య రాశి

సంగంలో గౌరవం పెరుగుతుంది. పెట్టుబడుల విషయాలలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. మహాగణపతిని పూజించడం మేలు చేస్తుంది.

తుల రాశి

ఈ రాశివారికి ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారులకు మంచి ఫలితాలు లభిస్తాయి. ఆరోగ్య విషయాలలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. దుర్గదేవి పూజ మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి

ఆస్తి విషయాలలో ఇబ్బందులు తప్పవు. అనారోగ్య సమస్యలు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. దుర్గమ్మ పారాయనం మేలు చేస్తుంది.

ధనస్సు రాశి

ఒప్పంద విషయాలలో ఒకింత అనుకూలంగా ఉంటుంది. వివిధ పనులలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. ఉద్యోగులు తమతమ విధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. లలిత సహాస్రనామ పారాయణం మేలు చేస్తుంది.

మకర రాశి

కుటుంబంలో గౌరవం దక్కుతుంది. ఉద్యోగాల్లో ఒత్తిడిలు తప్పవు. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. శివపంచాక్షరి మేలు చేస్తుంది.

కుంభ రాశి

వ్యక్తిగత అభివృద్ధి విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు కలిసి వస్తాయి. అష్టలక్ష్మీ అమ్మవారిని పూజించడం ఎంతో మేలు జరుగుతుంది.

మీన రాశి

ముఖ్యమైన స్నేహితులను కలుసుకుంటారు. మంచి వార్తలు కూడా వింటారు. వ్యాపారాలలో కొంత నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. విష్ణు ఆరాధన మేలు చేస్తుంది.

Read Also: ఈ రాశుల వారు ప‌ని రాక్ష‌సులు.. సెల‌వు రోజుల్లో కూడా ఏదో ఒక ప‌ని చేస్తూనే ఉంటారు. ఆ రాశులివే..

వార ఫలాలు: జూన్ 27 నుంచి జూలై 3 వరకు.. వీరికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.. ఉద్యోగాల్లో ఒత్తిళ్లు

సీనియర్లను కలుస్తున్న కొత్త పీసీసీ చీఫ్.. పొన్నాలతోపాటు వీహెచ్ కలవనున్న రేవంత్ రెడ్డి