Horoscope Today: ఆ రాశి వ్యాపారాలు లాభాలు ఆర్జిస్తారు.. 12 రాశుల వారికి గురువారం రాశిఫలాలు

| Edited By: Janardhan Veluru

Jan 25, 2024 | 5:01 AM

దిన ఫలాలు (జనవరి 25, 2024): మేష రాశి వారికి ఈ రోజు ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం ఉంటుంది. మిథున రాశి వారికి సామాజికంగా గౌరవమర్యాదలు పెరుగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: ఆ రాశి వ్యాపారాలు లాభాలు ఆర్జిస్తారు.. 12 రాశుల వారికి గురువారం రాశిఫలాలు
Horoscope Today 25th January 2024
Follow us on

దిన ఫలాలు (జనవరి 25, 2024): మేష రాశి వారికి ఈ రోజు ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం ఉంటుంది. మిథున రాశి వారికి సామాజికంగా గౌరవమర్యాదలు పెరుగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఈ రాశివారికి లాభ స్థానంలో ఉన్న శనీశ్వరుడు, దశమంలో రవి, భాగ్య స్థానంలో కుజ, బుధ, శుక్రులు ఉండడం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలపరంగా కొండంత అండ అని చెప్పవచ్చు. ఇది ఏ రంగానికి చెందినవారైనప్పటికీ అనుకూలంగా ఉంది. ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో ఉపయోగకర పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబపరంగా, సంతా నపరంగా కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

దశమ స్థానంలో శనీశ్వరుడు, లాభస్థానంలో రాహువు కారణంగా వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం ఉంటుంది. అధికారులతో అనుకూలతలు పెరుగుతాయి. వ్యాపారాలు నిలకడగా ఉంటాయి. నిరు ద్యోగులకు విదేశీ అవకాశాలు కూడా అంది వస్తాయి. భాగ్య స్థానంలో ఉన్న రవి వల్ల జీవిత భాగ స్వామికి మంచి గుర్తింపు, పురోగతి లభిస్తాయి. రాశ్యధిపతి శుక్రుడు అనుకూలంగా లేకపోవడం వల్ల పనిభారం పెరగడం, అలసట, శ్రమ వంటి తప్పకపోవచ్చు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

లాభ స్థానంలో గురువు, భాగ్య స్థానంలో శనీశ్వరుడు, సప్తమ స్థానంలో కుజ, బుధులు మంచి అదృష్టాన్ని కలిగిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలకు లోటు ఉండదు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సామాజికంగా గౌరవమర్యాదలు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. తల్లితండ్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందడం జరుగుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

అర్ధాష్టమ శని, దశమ గురువు కారణంగా వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిపాటి ఒత్తిడి, శ్రమ తప్పక పోవచ్చు. అయితే, ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. ఆదాయ మార్గాలు మరింతగా విస్తరిస్తాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు ఇబ్బంది పెడతాయి. అన వసర ఖర్చులు, అనవసర ప్రయాణాలు, అనవసర సహాయాల వల్ల ఇబ్బంది పడడం జరుగుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

భాగ్య స్థానంలో గురువు, సప్తమ స్థానంలో శనీశ్వరుడు ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాలు, వ్యాపా రాలు నిలకడగా ఉండడం, ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి కావడం జరుగుతుంది. విశ్రాంతి తక్కువవుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందు తుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. ముఖ్యమైన పనుల కారణంగా ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. మీ దగ్గర సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ఆరోగ్య సమస్యలుం టాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

చతుర్థ స్థానంలో ఉన్న కుజ, బుధ, శుక్రులు, షష్ట స్థానంలో ఉన్న శనీశ్వరుడి వల్ల ఆదాయం పెరుగుదలకు సంబంధించిన ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. శత్రు, రోగ, రుణ బాధలు చాలావరకు తగ్గుతాయి. సొంత రాశిలో సంచారం చేస్తున్న కేతువు వల్ల ఆధ్యాత్మి చింతన పెరుగుతుంది. మిత్రులతో అపార్థాలు తలెత్తు తాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

శని, రవి గ్రహాలు కాస్తంత ప్రతికూలంగా ఉన్నందువల్ల ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అధికారులతో, తండ్రితో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. సప్తమ రాశిలో సంచరిస్తున్న గురువు కారణంగా ఆర్థికంగా అనుకూలత పెరుగుతుంది. ఒకటి రెండు సమస్యల నుంచి బయటపడటానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ధన స్థానంలో ఉన్న రవి, శుక్ర, కుజుల కారణంగా వృత్తి, ఉద్యోగాల్లో మంచి యోగం పట్టే అవకాశం ఉంది. ప్రతిభా పాటవాలకు గుర్తింపుగా ప్రత్యేక బాధ్యతలు పెరుగుతాయి. గృహ, వాహన సంబంధ మైన సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆరో గ్యం చాలావరకు కుదుటపడుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. తల్లి వైపు నుంచి ఆర్థికంగా కలిసి వస్తుంది. ఖర్చులు తగ్గించుకోవాల్సి ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

పంచమ స్థానంలో గురువు. తృతీయంలో శని, ధన స్థానంలో రవి వల్ల ఆదాయం పెరగడం, ప్రతి విషయంలోనూ పురోగతి ఉంటుంది. సంపద కలిసి రావడం, ఆస్తి విలువ అధికం కావడం వంటివి జరుగుతాయి. సమాజంలో గుర్తింపు ఏర్పడుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఎటు వంటి ప్రయత్నమైనా సత్ఫలితాలనిస్తుంది. అవసరమైన వారికి అండగా నిలబడతారు. ముఖ్య మైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఒకటి రెండు శుభ పరిణామాలుచోటు చేసు కుంటాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ధన స్థానంలో శనీశ్వరుడు, తృతీయంలో రాహువు సంచరిస్తున్న కారణంగా ఆర్థికంగా అనుకూల పరిస్థితులుంటాయి. వ్యయ స్థానంలో మూడు గ్రహాలున్నందువల్ల ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉండడం, స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉండడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా పురోగతి కనిపిస్తుంది. కుటుంబ జీవితంలో సామరస్యం, దాంపత్య జీవితంలో అన్యోన్యత ఏర్పడ తాయి. బంధుమిత్రుల్లో మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాల్లో, ఆర్థిక లావాదేవీల్లో కలిసి వస్తుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

లాభ స్థానంలో కుజ, బుధ, శుక్ర గ్రహాలు ఉండడం వల్ల ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా, ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. రాజకీయ ప్రముఖులతో సన్నిహిత పరిచ యాలు ఏర్పడతాయి. అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఎదుగుదల ఉంటుంది. వ్యాపారాల్లో అంచనాలకు మింది లాభాలు కనిపిస్తాయి. విదేశాల్లో ఉన్న పిల్లలు, మిత్రుల నుంచి ఆశించిన సమాచారం లభిస్తుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారికి కలిసి వస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

లాభ స్థానంలో రవి, దశమంలో బుధ, కుజ, శుక్రులు, ధన స్థానంలో గురువు వల్ల ఉద్యోగంలో స్థిరత్వం లభించడంతో పాటు, జీతభత్యాలు ఆశించిన స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. ఆదాయా నికి లోటు ఉండదు. ఒకటి, రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అయి ఊరట లభిస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల ఆశించిన ప్రయోజనం ఉంటుంది. చాలావరకు ఆర్థిక సమ స్యలు తగ్గే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది.