ఈ రాశివారికి ఈరోజు అన్నీ శుభవార్తలు, విజయాలే.. బుధవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.!

|

Mar 24, 2021 | 7:46 AM

Horoscope Today: జాతకాలు, రాశిఫలాలను విశ్వసించేవారు చాలామంది ఉంటారు. ఏదైనా పనిని మొదలుపెట్టే ముందు కొంతమంది తమ దినఫలాలపై..

ఈ రాశివారికి ఈరోజు అన్నీ శుభవార్తలు, విజయాలే.. బుధవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.!
Follow us on

Horoscope Today: జాతకాలు, రాశిఫలాలను విశ్వసించేవారు చాలామంది ఉంటారు. ఏదైనా పనిని మొదలుపెట్టే ముందు కొంతమంది తమ దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. మరి బుధవారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో.. ఓసారి చూసేయండి.

మేష రాశి:

నూతన పరిచయాలు, ఆకస్మిక ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. పరమేశ్వరుని ఆరాధన మేలు చేస్తుంది.

వృషభ రాశి:

శుభవార్తలు, ఇంటర్వ్యూలలో విజయాలు సాధిస్తారు. సంకట నాసనా గణపతి స్తోత్ర పారాయణ మేలు చేస్తుంది.

మిధున రాశి:

రావాల్సిన బకాయిలు అలస్యమవుతాయి. రుణయత్నాలు. గౌరీ పూజ శుభ ఫలితాలను కలగజేస్తుంది.

కర్కాటక రాశి:

చిన్ననాటి స్నేహితుల కలయిక. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు అవసరం. గోవిందనామస్మరణ మేలు చేస్తుంది.

సింహ రాశి:

వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. ఉద్యోగులకు ఒత్తిడులు. పరమేశ్వరుని ఆరాధన, అభిషేకం మేలును కలగజేస్తుంది.

కన్య రాశి:

ఇబ్బందులు ఎదురవుతాయి, ఆకస్మిక ప్రయాణాలు, ఖర్చులు పెరుగుతాయి. శ్రీరాముని నామస్మరణ మేలు చేస్తుంది.

తులా రాశి:

షేర్లు, పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు అవసరం. తొందరపడినట్లయితే నష్టాలు, ఇబ్బందులు ఏర్పడతాయి. అష్టలక్ష్మీస్తోత్ర పారాయణ మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి:

స్నేహితుల సహకారంతో కష్టమైన పనులు పూర్తవుతాయి. దుర్గాసప్తస్లోకి పారాయణ మేలు చేస్తుంది.

ధనుస్సు రాశి:

లాభాదాయకరమైన పనులను చేపట్టాల్సి వస్తుంది. అవకాశాలను కోల్పోకుండా వాటిని సద్వినియోగం చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పారాయణ మేలు చేస్తుంది.

మకర రాశి:

అనుకున్న కార్యక్రమాలను ప్రారంభిస్తారు. పెద్దవారి ఆశీస్సులు, ఆలోచనలు మేలు చేస్తాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం శుభ ఫలితాలను కలగజేస్తుంది.

కుంభ రాశి:

ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. సమయపాలన పాటించడం అవసరం. అనవరమైన ఖర్చులు పెరుగుతాయి. దైవారాధన మేలు చేస్తుంది.

మీన రాశి:

విందు వినోదాల్లో పాల్గొంటారు. కొత్త పరిచయాల వల్ల ఇబ్బందులు, ఒత్తిడులు ఏర్పడతాయి. సుదర్శనస్వామి వారి నామస్మరణ మేలు చేస్తుంది.

Also Read:

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. హోళీ పండుగ గిఫ్ట్‌గా రూ. 10 వేలు.. వివరాలివే.!

జనసైనికుల స్ట్రాంగ్ వార్నింగ్.. రాపాకకు నో ఎంట్రీ బోర్డు.. వైరల్ అవుతున్న పిక్.!

బంగారం కొనాలనుకుంటున్నారా?.. అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే.. ఇవాళ ఏకంగా…