Horoscope Today: వారి ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు

| Edited By: Janardhan Veluru

Mar 23, 2024 | 5:01 AM

దిన ఫలాలు (మార్చి 23, 2024): మేష రాశి వారి ఆర్థిక పరిస్థితి వారు ఆశించిన స్థాయిలో మెరుగు పడుతుంది. వృషభ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహం కలిగిస్తాయి. మిథున రాశి వారి ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Horoscope Today: వారి ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు
Horoscope Today 23rd March 2024
Follow us on

దిన ఫలాలు (మార్చి 23, 2024): మేష రాశి వారి ఆర్థిక పరిస్థితి వారు ఆశించిన స్థాయిలో మెరుగు పడుతుంది. వృషభ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహం కలిగిస్తాయి. మిథున రాశి వారి ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనుల్ని సజావుగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటలో పడతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో మెరుగు పడుతుంది. ఆర్థికంగా ఇతరులను ఆదుకునే స్థితిలో ఉంటారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కొత్త స్నేహాలు ఏర్పడతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ప్రారంభించిన పనులు చురుకుగా పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహ రించడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహం కలిగిస్తాయి. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ప్రయాణాలు లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి విషయంలో అంచనాలు నిజమవుతాయి. పిల్లల్లో ఒకరికి స్వల్ప అనారోగ్యం సోకే అవకాశం ఉంది. నిరుద్యోగులు తమ ప్రయత్నాల మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇష్టమైన దేవాలయాలను సందర్శిస్తారు. ప్రయాణాలను వాయిదా వేసుకుంటారు. చేపట్టిన పనుల్లో అవరోధాలు తొలగుతాయి. ఇంటా బయటా శ్రమ, ఒత్తిడి ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో సత్ఫలితాలనిస్తాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లే‌ష)

ప్రతి పనినీ, ప్రతి వ్యవహారాన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆటంకాలను అధిగమిస్తారు. వ్యయ ప్రయాసలను పట్టించుకోరు. సోదరుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు బాగా ఉపయోగపడతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన ఆర్థిక పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

అదనపు ఆదాయ ప్రయత్నాల మీద మరింతగా శ్రద్ధ పెట్టడం మంచిది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఏమాత్రం లోటుండదు. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. బంధుమిత్రు లతో మాట పట్టింపులు రాకుండా చూసుకోవాలి. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు తిరుగుండదు. వ్యాపారాల్లో చిన్నా చితకా సమస్యలను అధిగమించి లాభాల బాట పడతారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక లాభాలకు లోటుండదు. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు పెరుగుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. ముఖ్యమైన అవసరాలన్నీ తీరిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో బాగా అను కూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆదాయంతో పోటీగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్య సూచనలు న్నాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా ఊపందుకుంటాయి. వృత్తి జీవితంలో క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగ వాతావరణం బాగా అనుకూలంగా సాగిపోతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఆశించిన శుభవార్తలు వింటారు. రావల సిన డబ్బు చేతికి అందుతుంది. ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటారు. ప్రముఖుల నుంచి ఆదరణ పెరుగుతుంది. అన్ని రంగాల వారికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఇంట్లో శుభకార్యానికి ప్లాన్ చేస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. బంధువుల నుంచి పెళ్లి విషయంలో శుభవార్తలు అందు తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు స్థిరంగా కొనసాగుతాయి. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశముంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయట పడతారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. ఎవరినీ గుడ్డిగా నమ్మ వద్దు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. ప్రతి ప్రయత్నమూ విజయ వంతం అవుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు ఇబ్బందేమీ ఉండదు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

కుటుంబసమేతంగా దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆదాయంతో పోటీగా వృథా ఖర్చులు పెరు గుతాయి. ముఖ్యమైన పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు న్నాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది. ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు చాలావరకు సానుకూలపడతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

కుటుంబపరంగా కొద్దిగా ఒత్తిడి, శ్రమ ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని కీలక మార్పులు తల పెడతారు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. బాగా దగ్గర బంధువులతో ఊహించని మాట పట్టింపు లుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగ జీవితం సాధారణంగా గడిచిపోతుంది. ఏ విషయంలోనూ తొందరపాటుతనం మంచిది కాదు. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెడతారు. ఆదాయ ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఇష్టమైన బంధుమిత్రులతో ఎంజాయ్ చేస్తారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఉద్యోగులకు పని భారం నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు పెంపొందుతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి.