Today Rasi Phalalu: నిత్యం మనం ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ఊహించనిరీతిలో జీవితం ప్రమాదంలో పడుతుంది. కావున తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ, చేపట్టే ప్రతీ కార్యంలోనూ ఆచితూచి, సమయానుకూలంగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే.. ఆదివారం ముఖ్యంగా పలు రాశుల వారికి పరిస్థితులు అనుకూలంగా ఉంటే.. మరికొన్ని రాశుల వారికి అనుకూలంగా లేవు. ఈ రోజు రాశిఫలాలు ఓ సారి చూద్దాం..
మేష రాశి : ఈ రోజు వ్యవహారాలలో పురోగతి. ఆస్తిలాభం. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి.
వృషభ రాశి : ఈ రోజు పనులు ముందుకు సాగవు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చిక్కులు. అనుకూలమైన శుభ ఫలితాల కోసం విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి.
మిధున రాశి :ఈ రోజు పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి.
కర్కాటక రాశి :ఈ రోజు చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. భూలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు. అనుకూలమైన శుభ ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి.
సింహరాశి : ఈ రోజు మిత్రులతో వివాదాలు తీరతాయి. పనులు చకచకా సాగుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి.
కన్యారాశి : ఈ రోజు రుణదాతల ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనుల్లో జాప్యం. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కోసం గరికతో గణపతికి పూజ చేయండి.
తులారాశి :ఈ రోజు మిత్రులతో అకారణంగా విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. మానసిక ఆందోళన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. అనుకూలమైన శుభ ఫలితాల కోసం నవగ్రహ స్తోత్రం పాటించాలి.
వృశ్చిక రాశి : ఈ రోజు కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనాలు సమకూర్చుకుంటారు. సోదరులతో సఖ్యత. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. గోమాతకు గ్రాసం పెట్టండి.
ధనుస్సు రాశి :ఈ రోజు చిత్రమైన సంఘటనలు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కోసం మృత్యంజయ జపం చేయడం మంచిది.
మకర రాశి :ఈ రోజు కుటుంబసభ్యులతో వివాదాలు పరిష్కారం. శుభవార్తలు అందుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి.
కుంభరాశి :ఈ రోజు వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. ప్రయాణాలు రద్దు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతంత మాత్రంగా ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి.
మీనరాశి : ఈ రోజు నూతన ఉద్యోగయత్నాలు సఫలం. యత్నకార్యసిద్ధి. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కోసం సూర్య దేవుని ఆరాధన చేయండి.