Horoscope Today March 18th 2021: ప్రస్తుత కాలంలో రాశిఫలాలను విశ్వసించేవాళ్లు అనేకం. ఉదయాన్నే తమ భవిష్యత్ రోజులో జరిగే విషయాలను ముందుగానే తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఈరోజు మార్చి 18 గురువారం నాడు చంద్రుడు అంగారకుడ రాశి అయిన మేషంలో ఉండనున్నాడు. ఈరోజు మేషరాశి నుంచి మీన రాశి వరకు రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ఈరోజు వీరు చేపట్టినటువంటి పనులలో ఏమాత్రం కూడా తొందరపడకూడదు. అలాగే ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ప్రకృతిని ఆరాధించడం.. ఇంట్లో ఉన్న చెట్లకు నీరు పోయడం మంచిది.
ఈరోజు వీరికి రావాల్సినటువంటి బాకీలను వసూలు చేయడంలో కాస్త పట్టుదలతో ఉండనున్నారు. నెమ్మదిగా మీరు చెపట్టినపనులు పూర్తిచేసుకుంటాయి. చిన్న పిల్లల ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు సుబ్రమణ్య స్వామి ఆరాధన మేలు చేస్తుంది.
ఈరోజు వీరికి వాహనాయోగాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు వీరికి శ్రీవెంకటేశ్వర స్వామి నిర్ణయాలు మేలు చేస్తుంది.
ఈరోజు వీరి శ్రమ ఎక్కువగా ఉంటుంది. అలాగే నిదానంగా పూర్తయ్యే పనులకు ఎక్కువగా ఆందోళన చేందాల్సిన పనిలేదు. ఈరోజు శివరాధన మేలు చేస్తోంది.
ఈరోజు వీరికి వ్యవహారిక విషయాల్లో ఎదురవుతున్న అవంతరాలను అధిగమించేందుకు ప్రయత్నిస్తుంటారు. దూరప్రయాణాల గురించి ఆలోచిస్తుంటారు. ఈరోజు పరమేశ్వరుని ఆరాధన, పేదవారికి అన్నదానం మేలు చేస్తుంది.
ఈరోజు వీరికి సంఘంలో మంచి ఆధారాభిమానాలు ఎదురవుతుంటాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. ఈరోజు వీరికి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం మేలు చేస్తుంది.
ఈరోజు వీరు ఎదుటివారితో మాట్లాడేముందు సహనాన్ని కోల్పోకూడదు. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఈరోజు అష్టలక్ష్మీ స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.
ఈ రోజు వీరు శుభవార్తలు వింటుంటారు. వ్యవహరిక విషయాల్లో అనుకూలమైన ప్రయోజనాలుంటాయి. ఈరోజు తులసి అర్చన, విష్ణు దర్శనం మేలు చేస్తుంది.
ఈరోజు వ్యవహారిక విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటుంటాయి. ప్రణాళిక లోపాల వలన కొన్ని కష్టాలుంటాయి. జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఈరోజు నవగ్రహ స్త్రోత్రం చేయడం మంచిది.
ఈరోజు వీరికి వాహన సౌఖ్యం ఉంటుంది. ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీరామ రక్ష స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.
ఈరోజు వీరు ప్రయాణపరంగా కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటారు. క్రియ, విక్రయాల్లో తొందరపడకూడదు. ఈరోజు గణపతి దర్శనం మేలు చేస్తుంది.
ఈరోజు వీరికి సోదరులతో విభేదాలు ఏర్పడుతాయి. జాగ్రత్తగా వహించాలి. ఈరోజు ఇంద్రకృత మహాపారాయణం మేలు చేస్తుంది.
Also Read:
ఆరోజున తులసి ఆకులను తెంపుతున్నారా ? అయితే జాగ్రత్త.. తుంచితే ఏమవుతుందో తెలుసా..