దిన ఫలాలు (ఏప్రిల్ 16, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి అనేక విధాలుగా మెరుగుపడుతుంది. వృషభ రాశి వారికి అన్ని వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
కొద్ది శ్రమతో అధిక లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి అనేక విధాలుగా మెరుగుపడుతుంది. కొందరు బంధుమిత్రులతో అపార్థాలు తొలగిపోతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు, ఆలస్యాలు ఉండకపోవచ్చు. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ అనవసర ఖర్చులు బాగా పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలను వ్యూహాత్మకంగా చక్కదిద్దుతారు. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించే అవకాశముంది. వృత్తి, వ్యాపారాలు బాగా లాభసాటిగా సాగిపోతాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. ఇష్టమైన బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో కష్టానికి తగ్గ ప్రతిఫలం, గుర్తింపు లభిస్తాయి. అన్ని వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలు స్థిరమైన లాభాలతో పురోగతి చెందుతాయి. నిరుద్యోగులకు ఉన్నత స్థాయి ఆఫర్లు లభిస్తాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక లావాదేవీల వల్ల ఆశించిన ప్రయోజనాలు కలుగుతాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు అందు తాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
గ్రహ సంచారం బాగా అనుకూలంగా ఉంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. వ్యక్తి గత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరుగు తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచ యాలు ఏర్పడతాయి. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఊహించని విధంగా మంచి సంఘటనలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. రావలసిన డబ్బు వసూలు అవుతుంది. చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాల్ని అందుకుం టారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. ఆరోగ్య పరిస్థితికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. ప్రస్తుతానికి ఎవరికీ హామీలు ఉండ వద్దు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో పదోన్నతి రావడానికి అవకాశముంది. వృత్తి జీవితం ఊపందుకుంటుంది. వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. రావలసిన బాకీలు సమయానికి అంది కొన్ని ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకుని ఇబ్బంది పడతారు. ప్రయాణాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. బంధువర్గంలో ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశముంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
రోజంతా సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు అంది వస్తాయి. ఉద్యోగ జీవితం బాగా అనుకూలంగా సాగిపోతుంది. అన్ని విధాలుగానూ ఆదాయం పెరుగు తుంది. కొందరు మిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ముఖ్యమైన కార్యక్రమాల్ని చేపట్టి, విజయాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక సంబంధమైన కార్యాల్లో పాల్గొంటారు. ఇష్టమైన ఆల యాలను సందర్శిస్తారు. కుటుంబ జీవితం హాయిగా గడిచిపోతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెడతారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగం సంపాదించే అవకాశముంది. ఇంటా బయటా అనుకూల పరిస్థి తులుంటాయి. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. ముఖ్యమైన ప్రయత్నాలు, వ్యవహారాలు సకాలంలో నెరవేరుతాయి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. కొందరు బంధుమిత్రులకు సాయం చేస్తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. శుభ వార్తలు వింటారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో పని భారం పెరిగినప్పటికీ ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమా ధిక్యత ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా కొనసాగుతుంది. కుటుంబ వాతావరణం చాలావరకు ప్రశాంతంగా, సామరస్యంగా సాగిపోతుంది. ఆస్తి వ్యవహారానికి సంబంధించి సోదరుల ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. ఎక్కువగా దైవ కార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
అనుకున్న వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. ముఖ్యమైన విషయాల్లో మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహారానికి వెళ్లే అవకాశముంది. వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు కలిసి వస్తాయి. ఉద్యోగాల్లో అధికారులకు బాగా నమ్మకం పెరుగుతుంది. మిత్రుల కారణంగా కొంత డబ్బు నష్టం జరిగే అవకాశముంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబసమేతంగా ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేపడతారు. ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. ఆదాయా నికి లోటుండదు. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. అయితే, వృథా ఖర్చుల్ని అదుపు చేయడం మంచిది. ఇంటికి బంధువులు వచ్చే అవకాశముంది. నిరుద్యోగులకు తప్పకుండా శుభ వార్తలు అందుతాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభి స్తుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో ఊహించని లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన పనుల్ని అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాల వల్ల సత్ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగంలో కొద్దిపాటి సమస్యలు ఉండవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ, ప్రతిఫలం బాగానే ఉంటుంది. ఆరోగ్యం సానుకూలంగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. విలాసాల్లో మునిగి తేలుతారు. చిన్ననాటి మిత్రు లతో విందు కార్యక్రమంగా పాల్గొంటారు. ఆదాయానికి లోటుండదు. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు రాబడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయా ణాల వల్ల ఆర్థికంగా బాగా లాభముంటుంది. తల్లితండ్రులు అనుకోకుండా ఇంటికి వచ్చే అవకాశ ముంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి.