Horoscope Today: ఆ రాశి వారి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.. 12 రాశుల వారికి శనివారం రాశిఫలాలు

| Edited By: Janardhan Veluru

Apr 13, 2024 | 5:01 AM

దిన ఫలాలు (ఏప్రిల్ 13, 2024): మేష రాశి వారికి ఈ రోజు వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృషభ రాశి వారు ప్రస్తుతానికి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. మిథున రాశి వారు ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: ఆ రాశి వారి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.. 12 రాశుల వారికి శనివారం రాశిఫలాలు
Horoscope Today 13th April 2024
Follow us on

దిన ఫలాలు (ఏప్రిల్ 13, 2024): మేష రాశి వారికి ఈ రోజు వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృషభ రాశి వారు ప్రస్తుతానికి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. మిథున రాశి వారు ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

సమయం అనుకూలంగా ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వస్తు లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసు కుని సరదాగా గడుపుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహా రాల్లో సన్నిహితుల సలహాలు తీసుకోవడం మంచిది. ఇంటా బయటా అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంతో ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా ఒత్తిడికి గురవుతారు. అధికారుల నుంచి ఆశించిన సానుకూలత లభించకపోవచ్చు. వ్యాపారాలు నిలకడగా కొనసాగుతాయి. కుటుంబ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. అనవసర వస్తువులపై ధన వ్యయం జరుగుతుంది. కుటుంబంతో కలిసి పుణ్య క్షేత్రాన్ని సందర్శిస్తారు. కొందరు మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ప్రస్తుతానికి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. ఆదాయం బాగా పెరుగుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెంచే అవకాశముంది. వృత్తి జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. కొత్త పనులు ప్రారంభించి ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ధనాదాయ మార్గాలు మరింత విస్తరిస్తాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగ జీవితం రొటీనుగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొత్త వ్యూహాలు అమలు చేసి లాభాలను అందుకుంటారు. ఆర్థిక ప్రయత్నాలకు అను కూల వాతావరణం నెలకొని ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. నిరు ద్యోగుల ప్రయత్నాలు ఫలించి, కొత్త అవకాశాలు అందుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం, ఆరోగ్యం నిలకడగానే ఉంటాయి. ముఖ్యమైన ప్రయత్నాలు సఫలమవు తాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

గ్రహ బలం బాగా అనుకూలంగా ఉంది. రోజంతా బాగానే గడిచిపోతుంది. చేపట్టిన పనులు సకా లంలో పూర్తవుతాయి. బంధుమిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ప్రయాణాల్లో కొద్దిగా ఇబ్బంది పడతారు. ఆదాయ పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం కూడా అన్ని విధాలా అనుకూలిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వ్యాపారాలు ఆశా జనకంగా ముందుకు సాగుతాయి. ఇతరుల పనుల కంటే సొంత పనులు మీద దృష్టి పెట్టడం మంచిది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో పని భారం బాగానే పెరిగే అవకాశముంది. వ్యాపారాల్లో రాబడి నిలకడగా ఉంటుంది. ముఖ్యమైన పనులు కూడా మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, అనవసర ఖర్చులు పెరిగి ఇబ్బంది పడడం జరుగుతుంది. ఆరోగ్యం మెరుగ్గానే ఉంటుంది. రుణ సమస్యల ఒత్తిడిని తగ్గించుకుంటారు. ఉద్యోగంలో మార్పు కోసం తీవ్రంగా ప్రయ త్నిస్తారు. కొందరు మిత్రులు తప్పుదోవ పట్టించే అవకాశముంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. దగ్గర బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు పొందుతారు. వృత్తి జీవితంలో డిమాండు బాగా పెరుగుతుంది. ఉద్యోగులకు నూతనావకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. కొన్ని మంచి పరిచయాలు ఏర్పడతాయి. అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగ, వ్యాపారాలు ఉత్సాహంగా, ఆశాజనకంగా సాగిపోతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. సమాజంలో గౌరవ ప్రతిష్ఠలు బాగా పెరుగుతాయి. శత్రు సమస్యలు, పోటీదార్ల బెడద నుంచి ఉపశమనం లభిస్తుంది. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఆస్తి విషయంలో సోదరులతో వివాదాలు సర్దుమణుగుతాయి. ఆర్థిక పరిస్థితికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. విలాసాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

చదువులు, ఉద్యోగాలకు సంబంధించి పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. సన్నిహితు లతో విభేదాలను పరిష్కరించుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలకు అవకాశముంది. ముఖ్య మైన పనులు, వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు న్నాయి. వృత్తి, వ్యాపారాల్లో భారీగా సంపాదన పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారులతో ఆచి తూచి వ్యవహరించడం మంచిది. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగంలో స్థిరపడే అవకాశముంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, వ్యాపారాల్లో చిన్నా చితకా సమస్యలు, ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఏవైనా ఉంటే పరి ష్కారం అవుతాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశముంది. అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. బంధువులతో అపార్థాలు తలెత్తే సూచనలున్నాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో ధైర్యంగా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులతో శుభ కార్యంలో పాల్గొంటారు. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక అనుకూలతలు పెరుగుతాయి. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఏ ప్రయత్నం తలపెట్టినా కలసి వస్తుంది. ముఖ్యంగా ఆర్థిక ప్రయత్నాలు అనుకూల ఫలితాలి స్తాయి. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. వృత్తి జీవితం రాబడిపరంగా సానుకూలంగా సాగిపోతుంది. ఉద్యోగంలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశ ముంది. స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే సూచనలున్నాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు. బంధువులతో కలసి దైవ కార్యంలో పాల్గొనే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి.