దిన ఫలాలు (అక్టోబర్ 12, 2024): మేష రాశి వారికి ఆదాయం, ఆరోగ్యం అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. మిథున రాశి వారికి నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అయి, కొత్త ఆఫర్లు ముందుకు వస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి జీవితంలో కార్యకలాపాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. కుటుంబ జీవితం చాలావరకు అనుకూలంగా గడిచిపోతుంది. ఆదాయం, ఆరోగ్యం అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ఒకరిద్దరు బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. జీవిత భాగస్వామితో వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుంచి శుభ వార్తలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. అధికారుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. తలపెట్టిన వ్యవహారాలు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ ఫలితం ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. ఆరోగ్యం మీద శ్రద్ద పెంచాల్సి ఉంటుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. బందుమిత్రుల నుంచి రావలసిన సొమ్ము కొద్ది ప్రయత్నంతో చేతికి అందే అవకాశం ఉంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో మీ సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలలో కీలక మార్పులు చేపడతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అయి, కొత్త ఆఫర్లు ముందుకు వస్తాయి. పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అయ్యే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఆదాయానికి లోటుండదు. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. పిల్లల చదువులకు సంబంధించి ఆశించిన సమాచారం అందుకుం టారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో అదనపు పని భారంతో ఇబ్బంది పడతారు. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఆదాయ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ద పెరుగుతుంది. కుటుంబ పరిస్థితులను మెరుగుపరచుకోవడం మీద దృష్టి పెడతారు. సమస్యలు, ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు అవసరం.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిపాటి ఇబ్బందులుంటాయి. సహచరులతో సమస్యలు తలెత్తుతాయి. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలుంటాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. సకాలంలో ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. నిరుద్యోగులకు మిత్రుల సహాయంతో కొత్త అవకాశాలు అందుతాయి. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. ఇతరుల వివాదాలు, వ్యవహారాల్లో తలదూర్చవద్దు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. బాధ్యతల్లో ఆశించిన స్థాయిలో మార్పులు జరుగుతాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి, వ్యాపా రాల్లో ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా బయటపడతారు. చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపు తారు. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి సారిస్తారు. పిల్లల చదువులకు సంబంధించి శుభ వార్తలు వింటారు. ముఖ్యమైన వ్యవహారాలు, పనులను కొద్దిపాటి శ్రమతో నిదానంగా పూర్తి చేస్తారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో బాధ్యతలు మారిపోయే అవకాశం ఉంది. ఆశించిన స్థాయిలో హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. వ్యాపారాలు ఆర్థికంగా పుంజుకుంటాయి. ఆదా యానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా గా సహాయ సహకారాలు అందిస్తారు. పనుల ఒత్తిడి కారణంగా విశ్రాంతికి దూరం అవుతారు. ఇక కుటుంబ బాధ్యతలు కూడా బాగా పెరుగుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా, ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో సహోద్యోగుల పనిభారాన్ని కూడా పంచుకోవాల్సి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. షేర్లు, స్కెక్యులేషన్ల వల్ల బాగా లాభం ఉంటుంది. మిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రయాణాల్లో, ఆహార, ఆహార విహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడికి తగ్గ లాభాలుంటాయి. ఉద్యోగంలో మీ వల్ల అధికారులు అనేక విధాలుగా లబ్ధి పొందుతారు. బంధువుల నుంచి శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఇంటా బయటా బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి. కొందరు స్నేహితుల వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు కొన్ని ప్రత్యేక బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇతరులతో వ్యవహరించడంలో మానసిక ఒత్తిడికి గురవుతారు. కుటుంబ వ్యవహారాలలో మీ నిర్ణయాలు అమలు జరుగుతాయి. ఆరోగ్యం సజావుగా సాగిపో తుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. అధికారులు ఎక్కువగా ఆధారపడతారు. వృత్తి జీవితం బిజీ అయిపోతుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆచితూచి ఖర్చు పెట్టడం మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటి వాతావరణం ఉత్సాహం కలిగిస్తుంది. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. పెళ్లి, ఉద్యోగ ప్రయ త్నాలకు సమయం అనుకూలంగా ఉంది. జీవిత భాగస్వామితో ఆలయాలను సందర్శిస్తారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలుంటామి. ఉద్యోగంలో అధికారులకు మీ మీద బాగా నమ్మకం పెరుగుతుంది. ఆదాయ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అనవసర ఖర్చుల్ని తగ్గిం చుకోవడం మంచిది. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. బంధువర్గం నుంచి పెళ్లికి సంబంధించిన శుభవార్తలు అందు తాయి. ప్రయాణాల్లో మంచి పరిచయాలు ఏర్పడతాయి. కొందరు మిత్రులతో ఎంజాయ్ చేస్తారు.