దిన ఫలాలు (ఏప్రిల్ 12, 2024): శుభ గ్రహాలు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నందువల్ల మేష రాశి వారికి ఈ రోజంతా సానుకూలంగా సాగిపోతుంది. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. మిథున రాశి వారికి ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
శుభ గ్రహాలు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నందువల్ల రోజంతా సానుకూలంగా సాగిపోతుంది. సోదరులతో స్థిరాస్తి వ్యవహారాలను పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూ లంగా ఉంటుంది. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ఇష్టమైన బంధువులు ఇంటికి వచ్చే సూచనలున్నాయి. ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వృత్తి జీవితంలో రాబడి పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. ఆరోగ్యం బాగానే మెరుగుపడు తుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
రాశి నాథుడైన శుక్రుడు లాభ స్థానంలో ఉచ్ఛలో ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్య లను పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. అవి తప్పకుండా మంచి అదృష్టాన్ని కలిగిస్తాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. వృథా ఖర్చులున్నప్పటికీ రోజంతా సంతోషంగా గడిచిపోతుంది. ఇంట్లో శుభ కార్యాలు నిర్వహించడం గురించి ఆలోచిస్తారు. ఆకస్మిక ధన లాభా నికి కూడా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా, ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యో గంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. నిరుద్యోగులు శుభ వార్త వింటారు. ఆరోగ్యం పరవాలేదు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. కుటుంబానికి సంబంధించి శుభ వార్తలు అందుతాయి. జీవిత భాగస్వామికి ధన యోగం పట్టే అవకాశముంది. చిన్ననాటి మిత్రు లతో బాగా ఎంజాయ్ చేస్తారు. ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. చేపట్టిన పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటా బయటా ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
చదువులు లేదా ఉద్యోగాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు గట్టెక్కుతారు. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండదు. రాబడి బాగా పెరిగే అవకాశముంది. ఉద్యోగంలో గౌరవాభిమానాలు కొనసాగుతాయి. కుటుంబ విషయాల్లో ధైర్యంగా వ్యవహరించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
శని, శుక్రుల బలం బాగా ఉన్నందువల్ల అన్ని విధాలుగానూ సమయం అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. వీటిని విస్తరించుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగ జీవితంలో ఆత్మ విశ్వాసంతో పురోగతి చెందుతారు. కుటుంబ సభ్యుల నుంచి శుభ వార్తలు అందుతాయి. రావలసిన డబ్బు చేతికి అంది ముఖ్యమైన అవసరాలు గడిచిపోతాయి. చేపట్టిన పనుల్ని అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
రాశ్యధిపతి శుక్రుడు ఉచ్ఛతో ఉండడం, గురువు సప్తమ స్థానంలో ఉండడం వల్ల రోజంతా సుఖ సంతోషాలతో సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలను విస్తరించుకునే ప్రయత్నం చేపడతారు. ఆర్థిక ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆకస్మిక ధన లాభా నికి కూడా అవకాశముంది. బంధుమిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగంలో మీ మాటకు ఎదురుండదు. ఆరోగ్యం విషయంలో వీలైనంత అప్రమత్తంగా ఉండాలి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
గ్రహ బలం పూర్తి స్థాయిలో అనుకూలంగా లేనప్పటికీ, పట్టుదలగా కొన్ని వ్యవహారాలు చక్కబెడ తారు. జీవిత భాగస్వామి నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలు ఎదురైన ప్పటికీ, వాటిని నిదానంగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశ ముంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మందిచి. పిల్లల మీద దృష్టి పెట్టాల్సిన అవసరముంది. ఆరోగ్యం చాలావరకు మెరుగ్గానే ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
గురు, శుక్రుల బలం అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, వ్యాపారాల్లో భారీగా లాభాలు అందుకుం టారు. దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం చేస్తారు. ఇంటా బయటా ఎటువంటి సమస్య లున్నా అధిగమించి ముందుకు సాగుతారు. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఉద్యోగులు ఉన్నత పదవులు పొందే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఏమాత్రం లోటుండదు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
శుక్ర, శని, బుధుల సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక వ్యవహారాలన్నీ అనుకూలంగా సాగిపోతాయి. ఎటువంటి ప్రయత్నమైనా సఫలం అవుతుంది. ఏ రంగానికి చెందినవారికైనా సమ యం బాగా అనుకూలంగా ఉంది. కొత్త కార్యక్రమాలకు, కొత్త నిర్ణయాలకు శ్రీకారం చుట్టడం మంచిది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి సహకారం ఉంటుంది. కుటుంబపరంగా శుభవార్తలు వింటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
కొద్దిపాటి గ్రహ బలం వల్ల రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది. విలువైన వస్తువులు కొను గోలు చేస్తారు. వస్త్రాభరణాల మీద కూడా బాగా ఖర్చు చేస్తారు. రావలసిన డబ్బు చేతికి అందు తుంది. బాకీలను వసూలు చేసుకుంటారు. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్త వుతాయి. వృత్తి, వ్యాపారాల్లో చాలావరు పురోగతి సాధిస్తారు. ఆస్తి వివాదానికి సంబంధించి శుభ వార్త వింటారు. ఉద్యోగంలో అధికారులకు బాగా సహకరిస్తారు. స్వల్ప అనారోగ్యం తప్పకపోవచ్చు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
రాశ్యధిపతి గురువు ధన స్థానంలో ఉన్నందువల్ల ఆస్తి సంబంధమైన ఒప్పందాలు కుదురు తాయి. ఆస్తుల విలువ పెరుగుతుంది. ధన ధాన్య వృద్ధి ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడ తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగ జీవితంలో ప్రాభవం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు.