Horoscope Today 04th October 2024
దిన ఫలాలు (అక్టోబర్ 4, 2024): మేష రాశి వారు ఈ రోజు ఉద్యోగం విషయంలోనూ, పిల్లల విషయంలోనూ విదేశాల నుంచి శుభవార్తలు వింటారు. వృషభ రాశి వారు పెళ్లి ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం అవుతాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. మిథున రాశి వారికి ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
- మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. కీలక మార్పులు చేపడతారు. ఉద్యోగంలో అనుకున్న లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తారు. స్థాన చలనానికి అవకాశం ఉంది. ఉద్యోగం విషయంలోనూ, పిల్లల విషయంలోనూ విదేశాల నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగ స్వామితో దైవ దర్శనం చేసుకుంటారు. ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యజయం కలుగుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, హుషారుగా సాగిపోతుంది.
- వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. ఇష్టమైన బంధు మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. పెళ్లి ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం అవుతాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది.
- మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): వృత్తి, వ్యాపారాలలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి జీవితం సానుకూల మలుపులు తిరుగుతుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడే అవకాశం ఉంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. చేపట్టిన పనులు వ్యవహారాలు సకాలంలో సంతృ ప్తికరంగా పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. ధనపరంగా ఎవరికీ మాట ఇవ్వవద్దు.
- కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయానికి లోటుండదు. ఉద్యోగుల పనితీరు అధికారులకు సంతృప్తి కలిగి స్తుంది. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెడతారు. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం కనిపిస్తుంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. పెండింగులో ఉన్న పనులు, వ్యవహారాలను మిత్రుల సహాయంతో పూర్తి చేస్తారు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది.
- సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరులకు డబ్బు ఇచ్చినా, ఇతరుల నుంచి డబ్బు తీసుకున్నా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు చాలావరకు పరి ష్కారం అవుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కాస్తంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగంలో సహచరులతో చిన్న పాటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు.
- కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఉద్యోగ బాధ్యతలు మారే అవకాశం ఉంది. అధికారులు అండగా ఉంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా బయటపడతారు. నిరుద్యోగులు చిన్న ప్రయత్నంతో మంచి ఉద్యో గం సంపాదిస్తారు. ఇంటా బయటా సానుకూల పరిస్థితులుంటాయి. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగిపోతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. కుటుంబ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
- తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఉద్యోగంలో కొన్ని మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో మీ నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. వ్యక్తిగత సమస్యలకు చాలా వరకు పరిష్కారం లభిస్తుంది. ప్రముఖులతో కలిసి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొం టారు. బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
- వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఉద్యోగంలో సహోద్యోగులతో బాధ్యతలను పంచుకోవాల్సి వస్తుంది. వృత్తి జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. కుటుంబ విషయా లకు బంధువులను దూరంగా ఉండడం మంచిది. ఇంటా బయటా శ్రమ, తిప్పట కాస్తంత ఎక్కు వగా ఉంటాయి. సొంత విషయాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఇతరుల తగాదాల్లో తలదూర్చవద్దు.
- ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఉద్యోగంలో అధికారులకు నమ్మకంతో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి. వ్యాపారాల్లో కొద్ది పాటి లాభాలకు అవకాశం ఉంది. ఆస్తి వివాదంలో బంధువర్గం నుంచి సహాయ సహకారాలు లభి స్తాయి. కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదాయానికి ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది. కొద్ది శ్రమతో కొన్ని పనులు, వ్యవహారాలను పూర్తి చేస్తారు.
- మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. జీతభత్యాలు ఆశించిన స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ జీవితంలో కొద్దిగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ప్రయా ణాల వల్ల లాభం ఉంటుంది. ఆహార, విహారాల్లో కొన్ని ముందస్తు జాగ్రత్తలు పాటించడం అవసరం.
- కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. అధికారుల నుంచి ఆశిం చిన ప్రోత్సాహకాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఉత్సాహం పెరుగుతుంది. లాభాలు, రాబడి బాగా వృద్ధి చెందుతాయి. ఇంటా బయటా మాటకు విలువ పెరుగుతుంది. కొందరు ప్రము ఖులతో పరిచయాలు పెరుగుతాయి. బంధువులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అయ్యే సూచనలు న్నాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
- మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఉద్యోగంలో అధికారులు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాలలో అనుకూలతలు పెరుగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు విజయ వంతం అవుతాయి. ఆదాయ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యక్తి గత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరిగే అవ కాశం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆశించిన శుభవార్తలు వింటారు.