Gaja Kesari Yoga: గురు చంద్రుల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!

Zodiac Signs: ఈ నెల(నవంబర్) 15, 16, 17 తేదీల్లో వృషభ రాశిలో గురు, చంద్రుల కలయిక జరుగుతోంది. వృషభ రాశి చంద్రుడికి ఉచ్ఛరాశి. ఈ స్థానంలో గురు చంద్రుల కలయిక వల్ల పూర్తి స్థాయి గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఆదాయపరంగా నిర్ణయాలు తీసుకోవడానికి, ఆదాయాన్ని వీలైనంతగా వృద్ధి చేసుకోవడానికి ఈ మూడు రోజుల కాలం బాగా అనుకూలంగా ఉంటుంది.

Gaja Kesari Yoga: గురు చంద్రుల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
Gaja Kesari Yoga

Edited By:

Updated on: Nov 12, 2024 | 6:52 PM

ఈ నెల 15, 16, 17 తేదీల్లో వృషభ రాశిలో గురు, చంద్రుల కలయిక జరుగుతోంది. వృషభ రాశి చంద్రుడికి ఉచ్ఛరాశి. ఈ స్థానంలో గురు చంద్రుల కలయిక వల్ల పూర్తి స్థాయి గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఆదాయపరంగా నిర్ణయాలు తీసుకోవడానికి, ఆదాయాన్ని వీలైనంతగా వృద్ధి చేసుకోవడానికి ఈ మూడు రోజుల కాలం బాగా అనుకూలంగా ఉంటుంది. ఈ గజకేసరి యోగ కాలంలో తీసుకునే నిర్ణయాలు, చేపట్టే కార్యక్రమాలు, ప్రయత్నాలు అతి తక్కువ కాలం నెరవేరే అవకాశం ఉంటుంది. మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశులకు ఆదాయం, అధికారం, ఆరోగ్యం, ఆస్తి వ్యవహారాలు, శుభ కార్యాలు తదితర విషయాల్లో చేసే ప్రయత్నాలు తప్పకుండా విజయవంతం అవుతాయి.

  1. మేషం: ఈ రాశికి ధన స్థానంలో గురు చంద్రుల యుతి ఏర్పడుతున్నందువల్ల ఎటువంటి ఆదాయ ప్రయ త్నమైనా బాగా కలిసి వస్తుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆదా యం లేదా ఆస్తి సంబంధమైన నిర్ణయాలు తీసుకోవడానికి, ప్రయత్నాలు చేపట్టడానికి ఇది బాగా అనుకూల సమయం. ఆరోగ్యం బాగా మెరుగుపడే అవకాశం ఉంది. కుటుంబ పరిస్థితులు హ్యాపీగా కొనసాగుతాయి. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. మాటకు విలువ పెరుగుతుంది.
  2. వృషభం: ఈ రాశిలో ఉన్న గురువుతో ఉచ్ఛ చంద్రుడు కలవడం వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆదాయ ప్రయత్నాలు చేపట్టడం వల్ల తప్పకుండా లాభం కలుగుతుంది. ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటలో పయనిస్తాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. లాభసాటి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. పిల్లలు విజయాలు సాధిస్తారు. సంతానయోగానికి అవకాశం ఉంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.
  3. కర్కాటకం: రాశినాథుడు చంద్రుడు ఉచ్ఛపట్టడంతో పాటు, గురువుతో కలవడం వల్ల జీవితంలో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. శత్రు, రోగ, రుణ సమస్యల మీద విజయాలు కలుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆరోగ్య సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. సరైన వైద్య చికిత్స లభిస్తుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. శుభవార్తలను ఎక్కువగా వినడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది.
  4. కన్య: ఈ రాశికి భాగ్య స్థానంలో గజకేసరి యోగం ఏర్పడడం వల్ల కెరీర్ పరంగా అనేక లాభాలు కలుగు తాయి. ఉద్యోగంలో పదోన్నతికి లేదా హోదా పెరగడానికి అవకాశం ఉంటుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఊహించని ఉద్యోగ లాభం కలుగు తుంది. ఈ మూడు రోజుల కాలంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ తప్పకుండా కొద్ది రోజుల్లో సత్ఫలితాలనిస్తాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది.
  5. వృశ్చికం: ఈ రాశికి సప్తమ స్థానంలో గురు, చంద్రుల కలయిక ఏర్పడడం వల్ల రాజయోగాలు కలుగు తాయి. సమాజంలో ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందడం జరుగుతుంది. రాజకీయ ప్రముఖు లతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. అనేక వైపుల నుంచి ఆదాయం కలిసి వస్తుంది. ఉద్యో గంలో వేతనాలు పెరగడంతో పాటు, పదోన్నతి కూడా కలుగుతుంది. ఉన్నత స్థాయి కుటుంబంతో ప్రేమలో పడడం లేదా పెళ్లి కుదరడం జరుగుతుంది. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది.
  6. మకరం: ఈ రాశికి పంచమ స్థానంలో గజకేసరి యోగం ఏర్పడడం వల్ల ఉద్యోగంలోనే కాక, వృత్తి, వ్యాపా రాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా ఘన విజయాలు లభిస్తాయి. శత్రు, రోగ, రుణ సమస్యల నుంచి చాలావరకు విముక్తి కలుగుతుంది. ఇప్పుడు చేపట్టే ఏ ప్రయత్నమైనా తప్పకుండా సఫల మయ్యే అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆదాయం పెరిగి, ముఖ్యమైన అవసరాలు తీరిపో తాయి. గృహ, వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది.
Loading...
Unable to load recommendations.
Follow Us