జ్యోతిష్య శాస్త్రంలో రాహువు, కేతువులను ఛాయా గ్రహాలుగా పరిగణిస్తారు. రాహువు ఛాయా గ్రహం. దీని నీడ ఎవరి జాతకంలో పడితే ఆ వ్యక్తి పరిస్థితి మారిపోతుందని అంటారు. ప్రజల జీవితాల్లో బాధాకరమైన సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి జరగడం ప్రారంభిస్తాయి. మానవ జీవితం కష్టంగా మారుతుంది. అయితే రాహువు నీడ ఎప్పుడూ హానికరం కాదని మీకు తెలుసా. కొన్ని పరిస్థితులలో మాత్రమే బాధాకరంగా మారతాయి. ఎవరి జాతకంలోనైనా రాహువు ఛాయ ఉంటే అది కూడా కొన్ని సార్లు ప్రయోజనం కలిగిస్తుంది. అయితే ఇది అన్ని రాశుల విషయంలో ఒకేలాంటి ఫలితాలు ఉండవు. పండితుల ప్రకారం 12 రాశులలో రాహువు ఛాయ ప్రయోజనకరంగా ఉండే రెండు రాశులు ఉన్నాయి.
వాస్తవానికి నవ గ్రహాల్లో రాహు-కేతువులు.. శనిశ్వరుడికి సంబంధించిన రెండు విభిన్న రూపాలుగా పరిగణించబడుతున్నాయి. రాహువు శనిశ్వరుడికి అధిపతిగా.. కేతువును మొండెంగా పరిగణిస్తారు. ఎవరి జాతకంలోనైనా రాహువు లేదా కేతు దోషం ఉంటే అది వారి మనస్సుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. తెలివితక్కువ పనులు చేసేలా చేస్తుంది. పెద్దల నమ్మకాల ప్రకారం, రాహు-కేతులను నీడ గ్రహాలుగా పరిగణిస్తారు. వీటి కారణంగా సూర్య, చంద్ర గ్రహణాలు సంభవిస్తాయి. రాహువు ప్రభావం కూడా జన్మకు సంబంధించినది కావచ్చు. అంటే జనన సమయంలో రాహువు నీడ సరైన స్థానంలో ఉండక పొతే అలాంటి వ్యక్తులు వారి జీవితాంతం ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. కనుక జనన సమయంలో రాహువు చాయ సరైన స్థానంలో ఉంటే శుభ ఫలితాలను ఇస్తుంది.
రాహువు అనుగ్రహం కోసం అనేక నివారణలు సూచించబడ్డాయి. ఓం భ్రం భ్రం బ్రౌం సః రాహవే నమః (ऊँ भ्रां भ्रीं भ्रौं सः राहवे नमः) అనే మంత్రాన్ని పఠించడం ద్వారా వ్యక్తి రాహు దోషం నుంచి విముక్తి పొందుతాడు. శనివారం రోజున ఈ మంత్రాన్ని పఠిస్తే మేలు జరుగుతుంది. అంతే కాదు సోమవారం రోజున కూడా ఈ మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల రాహు దోషం నుండి ఉపశమనం లభిస్తుంది. ఇంటికి రాహు యంత్రాన్ని కూడా తీసుకురావచ్చు. రాహు యంత్రాన్ని ఇంట్లో పవిత్ర స్థలంలో ఉంచి రోజూ పసుపు,కుంకుమతో పూజ చేయండి. ఇలా చేయడం కూడా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. అంతే కాకుండా నువ్వులు దానం చేయడం, ఆహార ధాన్యాలు దానం చేయడం, కుక్కలకు రొట్టెలు తినిపించడం వంటివి కూడా మేలు చేస్తాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి