
దిన ఫలాలు (నవంబర్ 7, 2026): మేష రాశి వారికి ఈ రోజంతా సానుకూలంగా, సంతృప్తికరంగా గడిచిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మాట చెల్లుబాటవుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల నుంచి ఆదరణ ఉంటుంది. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు కనిపిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
రోజంతా సానుకూలంగా, సంతృప్తికరంగా గడిచిపోతుంది. గురు బలం కారణంగా వృత్తి, ఉద్యోగాల్లో మాట చెల్లుబాటవుతుంది. వ్యాపారాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. వ్యక్తిగతంగా కొన్ని ముఖ్యమైన సంస్థల నుంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. కొందరు రాజకీయ ప్రముఖులు పరిచయం అవుతారు. అత్యవసర వ్యవహారాలను స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది.
ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల నుంచి ఆదరణ ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరిగే అవకాశం ఉంది. అనుకున్న పనులు కొన్ని వాయిదా పడతాయి. ఆదా యానికి మించి ఖర్చు పెరిగే సూచనలున్నాయి. వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. కుటుంబ జీవితంలో అనుకోకుండా చికాకులు తలెత్తుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఎవరికీ గుడ్డిగా నమ్మవద్దు.
వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు కనిపిస్తాయి. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభిస్తాయి. బంధుమిత్రులతో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కొత్తవారితో పరిచయాలు పెరుగుతాయి. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఎటువంటి ప్రయత్నమైనా తప్పకుండా నెరవేరుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది.
కుటుంబపరంగా ఒకటి రెండు శుభవార్తలు వినడం, అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకోవడం జరుగుతుంది. ఆదాయ వృద్ధికి బాగా అవకాశం ఉంది. ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. వృత్తి జీవితం ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వ్యాపారాలకు ఇబ్బంది ఉండదు. ఆరో గ్యం మెరుగ్గా ఉంటుంది. కుటుంబ జీవితంలో కొద్దిగా మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. వాదో పవాదాలకు అవకాశం ఇవ్వవద్దు. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది.
వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులతో సమస్యలు ఉండవచ్చు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలను ఎంతో శ్రమ మీద పూర్తి చేస్తారు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. నిరుద్యోగులు, అవివాహితులకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆహార, విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. ఆదాయానికి లోటుండకపోవచ్చు కానీ, అనవసర ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.
ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించడంలో సహోద్యోగుల సహకారం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సజా వుగా సాగిపోతాయి. తక్కువ ప్రయత్నంతో ఎక్కువ ఫలితం పొందుతారు. ముఖ్యమైన పనులు సునాయాసంగా పూర్తవుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. పిల్లల చదువు లకు సంబంధించి ఆశించిన సమాచారం అందుకుంటారు. దూరపు బంధువుల్లో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. ప్రయాణాలు లాభిస్తాయి.
వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు తిరుగుండదు. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ఆర్థికాభి వృద్ధి సమయం బాగా అనుకూలంగా ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలు, ఆలోచనలు కలిసి వస్తాయి. ఆశించిన స్థాయిలో సంపాదన పెరుగుతుంది. మిత్రుల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులు పరిచయం అవుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో సానుకూలత ఏర్పడుతుంది.
రోజంతా క్షణం కూడా తీరిక లేకుండా గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు, లావాదే వీలు బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో సహచరుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అనుకోకుండా చిన్ననాటి మిత్రులతో విందులో పాల్గొంటారు.
ఉద్యోగంలో అధికారుల ఆదరాభిమానాలను చూరగొంటారు. వృత్తి, వ్యాపారాల్లో సానుకూల పరిస్థి తులుంటాయి. సోదరులతో స్థిరాస్తి సంబంధమైన వివాదం పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. పిల్లల విషయంలో మరింత శ్రద్ధ చూపిం చడం మంచిది. కుటుంబ వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. ఉద్యోగ, పెళ్లిప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. ఆదాయానికి లోటుండదు.
ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి నిలకడగా ఉంటుంది. శత్రు, రోగ, రుణ బాధలు అదుపులో ఉంటాయి. కొత్తవారితో పరిచయాల విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా సాగకపోవచ్చు. బంధుమిత్రుల సహాయంతో అత్యవసర వ్యవహారాలు పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ వంటి విషయాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. ఎవరికీ హామీలు ఉండకపోవడం మంచిది.
రోజంతా ప్రశాంతంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. ఉద్యోగ జీవితం సానుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. తోబుట్టువులతో సఖ్యత, సామరస్యం పెరుగుతాయి. రాదనుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. మిత్రుల వివాదాల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తారు. విలువైన వస్తువులు కొంటారు.
ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. బాగా బిజీ అయిపోతారు. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరిగే సూచనలున్నాయి. కుటుంబానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడం జరుగుతుంది. ఇంటా బయటా పని ఒత్తిడి బాగా ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కొన్ని శుభవార్తలు వింటారు.