Horoscope Today: ఈ రాశివారి ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.. మరి మీ రాశి ఏంటి.?

| Edited By: Ravi Kiran

Sep 11, 2023 | 6:44 AM

ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఇంటికి కొత్త సౌకర్యాలను ఏర్పాటు చేసుకుం టారు. దీర్ఘకాలిక రుణాల ఒత్తిడిని తగ్గించుకుంటారు. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితా లనిస్తాయి. బంధుమిత్రులతో కలిసి ఒక శుభకార్యంలో పాల్గొంటారు. ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉన్నా ఉత్సాహంగా బాధ్యతలను నెరవేరుస్తారు.

Horoscope Today: ఈ రాశివారి ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.. మరి మీ రాశి ఏంటి.?
Horoscope Today 11th September 2023
Follow us on

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

రోజంతా హ్యాపీగా గడిచిపోతుంది. చాలావరకు అనుకూలమైన పరిణామాలే చోటు చేసుకుం టాయి. ఉద్యోగంలో అధికారుల అండదండలు లభిస్తాయి. వృత్తి జీవితంలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులు, అవివాహితుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దైవ కార్యాల మీద దృష్టి పెడతారు. ఆర్థిక ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆస్తి వివాదం ఒకటి కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతుంది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. కొత్త ఉద్యోగానికి సంబంధించి కంపెనీల నుంచి కీలక సమాచారం అందుతుంది. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, వ్యాపారాలవారికి ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు వేగంగా, చురు కుగా ముందుకు సాగుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ప్రయాణాల వల్ల ఆశించిన ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో మీ నిర్ణయాలు, ఆలోచనలకు ప్రోత్సాహం ఉంటుంది. స్వల్పంగా అనారోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది. తొందరపడి ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. సొంత పనుల మీద
శ్రద్ధ పెట్టడం మంచిది. జీవిత భాగస్వామి సలహాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

మధ్య మధ్య అష్టమ శని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. స్వల్ప అనారోగ్యాలు, పనుల్లో శ్రమ, తిప్పట, పని ఒత్తిడి వంటివి ఉంటూ ఉంటాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి వేధింపులుం టాయి. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లకపోవచ్చు. జీవిత భాగస్వామికి అదృష్టం పట్టవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. ఇతరులకు సహాయం చేసే పరిస్థితిలో ఉంటారు. పిల్లలు బాగా కష్టపడాల్సి ఉంటుంది. కుటుంబ పెద్దల్లో ఒకరి ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

రోజంతా బాగానే గడిచిపోతుంది. చిన్ననాటి మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. కుటుంబ జీవితంలో ఆనందోత్సాహాలు వెల్లి విరుస్తాయి. ఇంటికి ఇష్టమైన బంధువులు వచ్చే అవ కాశం ఉంది. కుటుంబ పెద్దల కారణంగా ఒక వ్యవహారం సునాయాసంగా పరిష్కారమవుతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల కారణంగా ఇబ్బంది పడతారు. స్వల్ప అనారోగ్యం కూడా బాధి స్తుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఆదాయం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలపరంగా శుభవార్తలు వింటారు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన శుభ వార్తలు వింటారు. కుటుంబ
పెద్దల్లో ఒకరికి అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో ముందుకు దూసుకుపోతారు. ఉద్యోగంలో మీ ప్రాభవం పెరుగుతుంది. అధి కారుల అండదండలు పుష్కలంగా లభిస్తాయి. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఇతరులకు ఇతోధికంగా సహాయం చేస్తారు. కుటుంబ సమేతంగా విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం
బాగా సహకరిస్తుంది. స్నేహితుల వల్ల డబ్బు నష్టపోతారు.

వృశ్చికం (విశాఖ, అనూరాధ, జ్యేష్ట)

అర్ధాష్టమి కారణంగా కొన్ని శారీరక లేదా మానసిక ఇబ్బందులు తప్పకపోవచ్చు. వృత్తి, వ్యాపా రాలు, ఉద్యోగాల్లో సానుకూల పరిస్థితులుంటాయి. ఆదాయ సమస్యలుండకపోవచ్చు. అయితే, ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ప్రతి పనికీ ఒకటికి రెండుసార్లు తిరగాల్సి వస్తుంది. కుటుంబపరమైన చికాకులు ఉంటాయి. స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది. బంధువులు కొందరు అపనిందలు వేసే అవకాశం
కూడా ఉంది. ఓర్పు, సహనాలతో వ్యవహరించడం మంచిది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

రోజంతా సానుకూలంగా, సామరస్యంగా సాగిపోతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగు పడుతుంది. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. రాజకీయ ప్రముఖులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవు తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఇంటికి కొత్త సౌకర్యాలను ఏర్పాటు చేసుకుం టారు. దీర్ఘకాలిక రుణాల ఒత్తిడిని తగ్గించుకుంటారు. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితా లనిస్తాయి. బంధుమిత్రులతో కలిసి ఒక శుభకార్యంలో పాల్గొంటారు. ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉన్నా ఉత్సాహంగా బాధ్యతలను నెరవేరుస్తారు. వృత్తి జీవితంలో యాక్టివిటీ పెరుగుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఒకరిద్దరు బంధువులతో జాగ్రత్తగా ఉండడం మంచిది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో పని భారం, పని వేళలు బాగా పెరుగుతాయి. వ్యాపారాల్లో కూడా క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల వ్యక్తిగత పనులు వాయిదా పడతాయి. ఆదాయా నికి ఇబ్బందేమీ ఉండదు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. జీవిత భాగస్వామికి కెరీర్ పరంగా పురోగతి ఉంటుంది. దూర ప్రాంతం నుంచి ఆశించిన శుభ వార్తలు అందుకుంటారు. ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయ వద్దు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టి లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహాలు లభిస్తాయి. ఆదాయం బాగానే ఉంటుంది. మితిమీరిన ఔదార్యంతో ఇతరు లకు సహాయం చేస్తారు. కుటుంబసమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. సమాజంలోని ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు, అవివాహితుల పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.