Shubh Yogas: సమ సప్తకంలో వక్ర గ్రహాలు.. ఆ రాశుల వారికి శుభ యోగాలు

| Edited By: Janardhan Veluru

Nov 24, 2024 | 7:53 PM

Telugu Astrology: జ్యోతిష శాస్త్రంలో వక్ర గ్రహాల పరస్పర వీక్షణకు అత్యంత ప్రాధాన్యం ఉంది. దీనివల్ల కొన్ని రాశులవారి జీవితాల్లో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ, కుటుంబ వాతావరణాలు బాగా అనుకూలంగా మారిపోయే అవకాశం ఉంటుంది.

Shubh Yogas: సమ సప్తకంలో వక్ర గ్రహాలు.. ఆ రాశుల వారికి శుభ యోగాలు
Telugu Astrology
Image Credit source: Getty Images
Follow us on

ఈ నెల 26 నుంచి డిసెంబర్ 15 వరకు వృశ్చిక రాశిలో బుధ గ్రహం వక్రగతి పడుతోంది. ఇప్పటికే వృషభ రాశిలో వక్రగతిలో ఉన్న గురు గ్రహానికి, బుధ గ్రహానికి మధ్య సమ సప్తక దృష్టి ఏర్పడుతోంది. రెండు శుభ గ్రహాలు పరస్పరం చూసుకోవడమే ఒక విశేషం కాగా, ఇవి రెండూ వక్రించి ఉండడం మరొక విశేషం. జ్యోతిష శాస్త్రంలో వక్ర గ్రహాల పరస్పర వీక్షణకు అత్యంత ప్రాధాన్యం ఉంది. దీనివల్ల కొన్ని రాశులవారి జీవితాల్లో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ, కుటుంబ వాతావరణాలు బాగా అనుకూలంగా మారిపోయే అవకాశం ఉంటుంది. వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి నిత్య కల్యాణం, పచ్చ తోరణంగా జీవితం సాగిపోతుంది.

  1. వృషభం: వక్రించిన గురు, బుధుల మధ్య పరస్పర శుభ దృష్టి ఏర్పడడం ఈ రాశివారికి అత్యంత యోగదాయకంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో కలలో కూడా ఊహించని పురోగతి ఉంటుంది. వ్యాపా రాల్లో లాభాలు పెరిగి, మరింతగా విస్తరించే అవకాశం ఉంటుంది. కుటుంబంలో పెళ్లి, గృహ ప్రవేశాల వంటి శుభ కార్యాలు జరుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా శుభ వార్తలు వినడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం వంటివి జరుగుతాయి. ఆదాయం ఊహించని స్థాయికి చేరుతుంది.
  2. కర్కాటకం: ఈ రాశివారికి ఈ రెండు గ్రహాల పరస్పర వీక్షణ అనేక విధాలుగా శుభ ఫలితాలనిస్తుంది. ఉద్యోగ జీవితంలో అనేక సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో తప్పకుండా పదో న్నతి లభిస్తుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశముంది. ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. అనేక వైపుల నుంచి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
  3. సింహం: ఈ రాశివారికి ఈ రెండు వక్ర గ్రహాల మధ్య శుభ వీక్షణ ఏర్పడడం వల్ల ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనా లను మించుతాయి. ఉద్యోగంలో హోదాతోపాటు జీతభత్యాలు, రాబడి బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. వారసత్వ సంపద లభించే అవకాశం ఉంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. గృహ, వాహన ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు బాగా వృద్ధి చెందుతాయి.
  4. వృశ్చికం: ఈ రాశిలో వక్రించిన బుధుడిని సప్తమ స్థానం నుంచి వక్ర బుధుడు వీక్షించడం వల్ల ఉద్యోగంలో కలలో కూడా ఊహించని ఉన్నత పదవులు లభిస్తాయి. సామాజికంగా కూడా స్థితిగతులు, గౌరవ మర్యాదలు మారిపోతాయి. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం ఖాయమవు తుంది. ప్రేమ వ్యవహారాల్లో ఘన విజయాలు సాధిస్తారు. ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉన్నత వర్గాలతో సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది.
  5. మకరం: ఈ రాశికి పంచమస్థానంలో ఉన్న వక్ర గురువు లాభ స్థానంలో సంచారం చేస్తున్న వక్ర బుధుడిని వీక్షిస్తున్నందువల్ల జీవన విధానంలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకోవడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో గణనీయమైన మార్పులు సంభవిస్తాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. మంచి గుర్తింపు లభిస్తుంది.
  6. మీనం: రాశినాథుడు గురువు వక్రించడం, దాని మీద భాగ్య స్థానం నుంచి వక్ర బుధుడి దృష్టి పడడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా శీఘ్ర పురోగతి కలుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికర స్థాయికి చేరుకుం టుంది. వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. సామాజికంగా కీర్తి ప్రతిష్ఠలు బాగా పెరుగుతాయి.