Budh Gochar 2024
ఈ నెల 29 నుంచి జనవరి 4వ తేదీ వరకు బుధుడు వృశ్చిక రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. మూడు వారాలకు మించి ఏ రాశిలోనూ ఉండని బుధుడు ఈ రాశిలో ఏకంగా 64 రోజులు కొనసాగనుండటం విశేషం. అంతేకాదు, వృషభ రాశిలో సంచారం చేస్తున్న గురువుకు, వృశ్చిక రాశిలో ఉన్న బుధుడికి మధ్య సమ సప్తక దృష్టి ఏర్పడడం అత్యంత విశేషం. ఈ రెండు శుభ గ్రహాలు పరస్పరం వీక్షించుకోవడం గజకేసరి యోగం కన్నా, బుధాదిత్య యోగం కన్నా బలమైన యోగాన్నిస్తుంది. వృషభం, కర్కాటకం, సింహం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారికి ఈ గురు, బుధుల పరస్పర వీక్షణ వల్ల అనేక విధాలాగా లాభాలు చేకూరబోతున్నాయి.
- వృషభం: ఈ రాశిలో ఉన్న గురువు సప్తమంలో ఉన్న బుధుడిని వీక్షించడం వల్ల ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం పడుతుంది. ఒక సంస్థకు అధిపతి లేదా సర్వాధికారి అయ్యే అవకాశం కూడా ఉంది. అంచనాలకు మించి అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతో షాలు నెలకొంటాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి.
- కర్కాటకం: ఈ రాశికి పంచమ స్థానంలో బుధుడితో లాభ స్థానంలో ఉన్న గురువుకు సమ సప్తక దృష్టి ఏర్ప డినందువల్ల, ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపారాలు విస్తరించే అవకాశం కూడా కలుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు మంచి సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు.
- సింహం: ఈ రాశికి చతుర్థ స్థానంలో ఉన్న బుధుడితో దశమంలో ఉన్న గురువుకు పరస్పర దృష్టి ఏర్పడి నందువల్ల ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. అప్రయత్న ధన లాభం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలపరంగా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది.
- కన్య: రాశ్యధిపతి బుధుడికి, భాగ్య స్థానంలో ఉన్న గురువుకు మధ్య పరస్పర దృష్టి ఏర్పడడం వల్ల ఈ రాశివారికి ధన, అధికార, ఆరోగ్య యోగాలు కలుగుతాయి. సంతాన యోగం కలుగుతుంది. కొద్ది ప్రయత్నంతో అత్యధికంగా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీతో పాటు లాభాలు కూడా వృద్ధి చెందుతాయి. అనా రోగ్యాల నుంచి ఆశించిన ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు లభి స్తాయి.
- వృశ్చికం: ఈ రాశిలో ఉన్న బుధుడి మీద గురువు దృష్టి పడినందువల్ల ఉన్నత స్థాయి వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. దాంపత్య సమస్యలు, కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో రాజయోగాలు పడతాయి. వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా వృద్ధి చెందుతుంది. వ్యక్తిగత, అనారోగ్య సమస్యల నుంచే కాక, ఆర్థిక సమస్యల నుంచి దాదాపు పూర్తిగా బయటపడతారు. సంతాన యోగానికి కూడా అవకాశముంది.
- మకరం: ఈ రాశికి పంచమ స్థానంలో ఉన్న గురువుకు, లాభ స్థానంలో ఉన్న బుధుడికి సమ సప్తక దృష్టి ఏర్పడడం రాజయోగం కలిగిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరిగే అవకాశం ఉంది.