ఇవాళ అర్ధరాత్రి రాహుగ్రస్త చంద్రగ్రహణం సంభవించింది. ఇదే ఈ ఏడాది చివరి గ్రహణం కానుంది. ఇది ఏయే రాశుల వారిపై ఎలాంటి ప్రభావం చూపించబోతోంది. మరీ ముఖ్యంగా తెలంగాణ దంగల్ టైమ్‌లో వచ్చిన ఈ గ్రహణం నేతలకు ఎలా ఉండబోతోంది.? కొన్ని రాశుల రాజకీయ నేతలకు ఈ గ్రహణంతో ఇబ్బందులు తప్పవా..? దీనిపై జ్యోతిష్యులు ఏమంటున్నారంటే..
ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం ఇవాళ సంభవించనుంది. అర్ధరాత్రి 1.05 గంటల నుంచి 2 గంటల 22 నిమిషాల వరకు చంద్రగ్రహణం ఏర్పడుంది. ఈ చంద్రగ్రహణం, భారత్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ తదితర దేశాలలో కనిపించింది. చంద్రుడు పాక్షికంగా భూమి నీడ గుండా వెళుతున్నప్పుడు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. భారతదేశంలో ఈసారి పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడింది.
ఈసారి ఏర్పడిన గ్రహణం రాహుగ్రస్త చంద్రగ్రహణం కావడంతో జ్యోతిష్కులు జాగ్రత్తలు చెబుతున్నారు. గ్రహణం సమయంలో నియమాలు పాటించాలంటున్నారు. కొన్ని రాశుల వారిపై ఎక్కువ ప్రభావం ఉంటుందని, వాళ్లు విధివిధానాలు ఆచరించాలంటున్నారు
ఇక ఎన్నికల వేళ, తెలంగాణ దంగల్ జోరు మీదున్న సమయంలో ఈ గ్రహణం రావడంతో దీనికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. కొన్ని రాశులకు చెందిన రాజకీయ నేతలకు ఇబ్బందులు తప్పవంటున్నారు జ్యోతిష్యులు. అసలే ఎన్నికల సీజన్ కావడంతో..మేషం, వృషభం, కన్య, మకర రాశికి చెందిన రాజకీయ నేతలు… ఈ గ్రహణం జ్యోతిష్యంతో అశాంతికి లోనయ్యే అవకాశం ఉందంటున్నారు జ్యోతిష్యులు.