Astrology 2023: కొత్త ఏడాదిలో ఈ మూడు రాశుల వారిపై శని ప్రభావం.. కొన్ని నివారణ చర్యలు సూచించిన వేణు స్వామి

|

Nov 28, 2022 | 3:16 PM

మీనరాశి జాతకులకుతో పాటు ఈ రెండు రాశుల్లో జన్మించిన వ్యక్తులు అదీ 27 ఏళ్ళ వయసు దాటిన వ్యక్తులపై శని తీవ్ర ప్రభావం చూపించనున్నదని చెప్పారు. ఈ రాశులకు చెందిన వ్యక్తులు ఆర్ధికంగా, సామాజికంగా, న్యాయపరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుందని వేణు స్వామి పేర్కొన్నారు.

Astrology 2023: కొత్త ఏడాదిలో ఈ మూడు రాశుల వారిపై శని ప్రభావం.. కొన్ని నివారణ చర్యలు సూచించిన వేణు స్వామి
Venu Swamy On Rasi Phalalu
Follow us on

మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రానుంది.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2023 జనవరి 16 వ తేదీ నుంచి శనిగ్రహంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయని ప్రముఖ పండితుడు వేణు స్వామీ పేర్కొన్నారు. ఈ నేపధ్యం శని ప్రభావం కర్కాటక రాశి, కన్య రాశి. మీన రాశి వారిపై పడనుందన్నారు. ముఖ్యంగా కన్యా రాశికి చెందిన వ్యక్తుల జీవితంలో పెను సంచలనాలు చోటు చేసుకుంటాయని తెలిపారు. అంతేకాదు మీనరాశి జాతకులకుతో పాటు ఈ రెండు రాశుల్లో జన్మించిన వ్యక్తులు అదీ 27 ఏళ్ళ వయసు దాటిన వ్యక్తులపై శని తీవ్ర ప్రభావం చూపించనున్నదని చెప్పారు. ఈ రాశులకు చెందిన వ్యక్తులు ఆర్ధికంగా, సామాజికంగా, న్యాయపరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుందని వేణు స్వామి పేర్కొన్నారు. కనుక ఈ రాశులకు చెందిన వ్యక్తులు.. సమస్యల ప్రభావం నుంచి బయటపడాలన్నా.. వీటి బారినుంచి బయటపడాలన్నా కొన్ని చర్యలు పాటించాలని తెలిపారు.

నివారణ చర్యలు:
నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి..
నలుపు రంగు వస్తువులను వినియోగించవద్దు
శనీశ్వరుడి అనుగ్రహం కోసం దాన ధర్మాలు చేయడం
శని చాలీసా పఠించడం,
ఆవాల నూనె దీపం వెలిగించండి

పూజ పరిష్కారం:
తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో శనీశ్వరుడి అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలను నిర్వహించండి. అంతేకాదు శనివారం రోజున రాత్రి అల్పాహారం మాత్రమే తీసుకోవాలి. ఇలా చేయడం వలన ఈ రాశులకు చెందిన వ్యక్తులు అనేక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉందని వేణు స్వామి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)