Lucky Zodiac Signs: శుభ గ్రహాల అనుగ్రహంతో ఆ రాశుల వారికి అదృష్ట యోగం.. మీ రాశికి ఎలా ఉందంటే..?

| Edited By: Janardhan Veluru

Nov 29, 2023 | 6:52 PM

శుభ గ్రహాలైన గురు, శుక్రులు పరస్పరం వీక్షించుకోవడం ఒక మహా యోగం అని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ఇందులో గురు గ్రహం దేవతల గురువు కాగా, శుక్ర గ్రహం రాక్షసుల గురువు. ఇందులో గురువు మేష రాశిలో సంచరిస్తుండగా, శుక్రుడు ఈ నెల 30 నుంచి తన స్వస్థానమైన తులా రాశిలో సంచారం ప్రారంభించడం జరుగుతుంది. శుక్రుడు తులా రాశిలో ప్రవేశించిప్పటి నుంచి డిసెంబర్ 25వ తేదీ వరకు ఈ ఇద్దరు గురువుల మధ్య పరస్పర వీక్షణ ఏర్పడుతుంది.

Lucky Zodiac Signs: శుభ గ్రహాల అనుగ్రహంతో ఆ రాశుల వారికి అదృష్ట యోగం.. మీ రాశికి ఎలా ఉందంటే..?
Subha Grahas 2023
Follow us on

శుభ గ్రహాలైన గురు, శుక్రులు పరస్పరం వీక్షించుకోవడం ఒక మహా యోగం అని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ఇందులో గురు గ్రహం దేవతల గురువు కాగా, శుక్ర గ్రహం రాక్షసుల గురువు. ఇందులో గురువు మేష రాశిలో సంచరిస్తుండగా, శుక్రుడు ఈ నెల 30 నుంచి తన స్వస్థానమైన తులా రాశిలో సంచారం ప్రారంభించడం జరుగుతుంది. శుక్రుడు తులా రాశిలో ప్రవేశించిప్పటి నుంచి డిసెంబర్ 25వ తేదీ వరకు ఈ ఇద్దరు గురువుల మధ్య పరస్పర వీక్షణ ఏర్పడుతుంది. ఈ రెండూ శుభ గ్రహాలే అయినందువల్ల పోటీపడి శుభ ఫలితాలిచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెండు గ్రహాల పరస్పర వీక్షణ ఆరు రాశుల వారికి తటస్థంగా ఉండగా, మరో ఆరు రాశుల వారికి మాత్రం ఏదో విధంగా యోగం కలగజేయడం జరుగుతుంది. అదృష్ట యోగం పట్టే రాశులుః మేషం, మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, మకరం. వీరికి ఈ శుభ గ్రహాల పరస్పర వీక్షణ ఏ విధంగా శుభ ఫలితాలనిస్తుందో చూద్దాం.

  1. మేషం: ఈ రాశిలో సంచరిస్తున్న గురువుకు, సప్తమ రాశిలో ప్రవేశిస్తున్న శుక్రుడికి పరస్పర వీక్షణ ఏర్పడుతోంది. దీని ఫలితంగా ఈ రాశివారికి తప్పకుండా మహా రాజయోగం పడుతుందని చెప్ప వచ్చు. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగాల్లో వీరికి బాగా డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకే కాక, నిరుద్యోగులకు కూడా ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. మంచి ఉద్యోగంలోకి మారడానికి అవ కాశం ఉంది. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆశించిన శుభవార్తలు వింటారు.
  2. మిథునం: ఈ రాశివారికి లాభ స్థానంలో ఉన్న గురువుకు, పంచమ స్థానంలో ఉన్న శుక్రుడికి వీక్షణ ఏర్పడు తున్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా వీరి ప్రతిభా పాటవాలు, శక్తి సామ ర్థ్యాలు బాగా వెలుగులోకి వస్తాయి. మంచి గుర్తింపు ఏర్పడుతుంది. పిల్లలు ఆశించిన దాని కంటే ఎక్కువగా వృద్ధిలోకి వస్తారు. సంతానం లేని వారికి సంతాన యోగం ఉంది. ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
  3. కర్కాటకం: ఈ రాశివారికి దశమ స్థానంలో ఉన్న గురువుతో, చతుర్థ స్థానంలో ఉన్న శుక్రుడికి దృష్టి ఏర్పడు తున్నందువల్ల, వృత్తి, ఉద్యోగాలతో పాటు సామాజికంగా కూడా హోదా, స్థాయి పెరుగుతాయి. పలుకుబడి పెరుగుతుంది. ఒక ఉన్నత స్థాయి వ్యక్తిగా చెలామణీ కావడం జరుగుతుంది. గృహ, వాహన సౌకర్యాలు వృద్ధి చెందుతాయి. ఆస్తులు సమకూరుతాయి. ఆస్తుల విలువ పెరుగుతుంది. విద్యార్థులు చదువుల్లో ఘన విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది.
  4. తుల: ఈ రాశిలో ప్రవేశిస్తున్న రాశ్యధిపతి శుక్రుడిపై గురువు దృష్టి పడుతున్నందువల్ల  ఈ రాశివారికి ప్రాభవానికి, ప్రాబల్యానికి పరిమితి ఉండదు. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత స్థాయికి చేరుకునే అవ కాశం ఉంది. వ్యాపారాల్లో విశేషమైన లాభాలు ఆర్జిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగు తాయి. చేపట్టిన ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. జీవితాన్ని మలుపు తిప్పే శుభ పరిణా మాలు చోటు చేసుకుంటాయి. అపారమైన ధన లాభం కలుగుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది.
  5. ధనుస్సు: ఈ రాశికి అధిపతి అయిన గురువుకు, లాభాధిపతి అయిన శుక్రుడికి మధ్య సమ సప్తక దృష్టి ఏర్పడుతున్నందువల్ల, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కనీ వినీ ఎరుగని అభివృద్ధి ఉంటుంది. తప్పకుండా అందలాలు ఎక్కడం జరుగుతుంది. ఆర్థికంగా అన్ని విధాలుగానూ కలిసి వస్తుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు విస్తరిస్తాయి. రాజకీయ ప్రముఖుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి.
  6. మకరం: ఈ రాశివారికి చతుర్థ, దశమ స్థానాల్లో సంచరిస్తున్న రెండు శుభ గ్రహాల మధ్య పరస్పర దృష్టి ఏర్పడడం ఒక విశేషమైన యోగం కింద భావించాలి. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత స్థాయికి చేరుకో వడం జరుగుతుంది. ఉద్యోగానికి సంబంధించిన ఏ ప్రయత్నమైనా తప్పకుండా ఫలిస్తుంది. విదే శాల నుంచి కూడా ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సన్మా నాలు, సత్కారాలు జరిగే అవకాశం కూడా ఉంది. రాజకీయ వర్గాలు లేదా ప్రభుత్వపరంగా గుర్తింపు లభిస్తుంది.