Telugu News Astrology Astro tips : wearing gold is not auspicious for everyone know the rules of astrology before using in telugu
Astro Tips: బంగారాన్ని ధరించే ముందు ఈ విషయాలు తెలుసుకోండి.. లేదంటే కష్టాలు, నష్టాలు కొని తెచ్చుకున్నట్టే..
జ్యోతిష్య శాస్త్రంలో బంగారాన్ని బృహస్పతి గ్రహానికి సంబంధించినదిగా పరిగణిస్తారు. అదే విధంగా వెండి చంద్రునికి, ఇనుము శనికి సంబంధించినది. అందుకే బంగారు ఆభరణాలు ధరించే ముందు ఎవరి జాతకంలో బృహస్పతి స్థానం ఎలా ఉందో చూసుకోవాలి.
భారతీయులకు బంగారానికి విడదీయరాని బంధం ఉంది. పసిడిని ఎల్లప్పుడూ విలువైన లోహంగా పరిగణిస్తారు. బంగారం ఆభరణాలను ధరించడం తమ ఆర్థిక స్థితికి చిహ్నంగా పరిగణిస్తారు. అందుకనే మహిళలు బంగారు ఆభరణాలను ఎక్కువగా ఇష్టపడతారు. ఆధునిక కాలంలో.. బంగారాన్ని పెట్టుబడిగా భావిస్తున్నారు. అయితే జ్యోతిష్య శాస్త్రంలో బంగారం అనేది లోహం, డబ్బు కాదు. సంపదకు సంబంధించినది కాదు. గ్రహాల శుభాలకు సంబంధించినది. జ్యోతిష్య శాస్త్రంలో బంగారాన్ని బృహస్పతి గ్రహానికి సంబంధించినదిగా పరిగణిస్తారు. అదే విధంగా వెండి చంద్రునికి, ఇనుము శనికి సంబంధించినది. అందుకే బంగారు ఆభరణాలు ధరించే ముందు ఎవరి జాతకంలో బృహస్పతి స్థానం ఎలా ఉందో చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో.. బంగారం ధరించే అభిరుచి వారికి హానికరంగా మారుతుంది. బంగారం అందరికీ శ్రేయస్కరం కాదని జ్యోతిష్య శాస్త్రంలో స్పష్టమైన అభిప్రాయం ఉంది. గ్రహాల వల్ల వ్యతిరేక ఫలితాలు రాకుండా ఉండాలంటే బంగారం ఎవరు ఎప్పుడు ధరించాలో తెలుసుకుందాం.
బంగారం ధరించడం ఎవరికి మంచిదంటే..
మేషం, కర్కాటకం, సింహం, ధనుస్సు లగ్నము లేదా రాశిలలో జన్మించిన వారికి బంగారం శుభ లోహం. ఈ రాశి వ్యక్తులు తమకు కావలసినంత బంగారాన్ని ధరించవచ్చు.
జాతకంలో బృహస్పతి శుభ స్థానంలో ఉన్నట్లయితే లేదా ఉచ్ఛస్థితిలో ఉన్నట్లయితే బంగారం ధరించవచ్చు. అలాగే ఎవరి జాతకంలోనైనా బృహస్పతి బలహీన స్థితిలో ఉంటే బంగారాన్ని ధరించడం వల్ల బలం చేకూరుతుంది.
అంతేకాదు లగ్నస్థుడు బలహీనంగా ఉంటే..బంగారం ధరించడం వలన బృహస్పతి లగ్నస్థ ఇంట్లో తన ప్రభావాన్ని చూపుతాడు. లగ్నస్థుడు బలపడతాడు.
ఎవరు బంగారం ధరించడం మంచికాదంటే..
వృషభం, మిథునం, వృశ్చికం, కుంభరాశులు లగ్నంగా లేదా రాశి ఉన్న వ్యక్తులు ఎక్కువ బంగారం ధరించడం మానుకోవాలి.
గురుగ్రహం అశుభ స్థానంలో ఉండడం వల్ల స్థూలకాయం పెరుగుతుంది. అందుకే స్థూలకాయంతో బాధపడేవారు బంగారం ధరించడం మానుకోవాలి.
ఉదర సమస్యలు కూడా గురుగ్రహానికి సంబంధించినవి. అటువంటి పరిస్థితిలో.. తరచుగా కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారు బంగారం ధరించడం మానుకోవాలి.
జాతకంలో శనీశ్వరుడు అశుభ స్థానంలో ఉన్నప్పుడు బంగారం ధరించడం మానుకోవాలి. వీరికి ఇనుముతో చేసిన ఉంగరం మరింత ఫలవంతంగా ఉంటుంది.
బంగారు ఉంగరం ధరించే వేలికి ఇనుప ఉంగరం లేదా మరే ఇతర లోహం ధరించకూడదు. దీని వలన గురువు ప్రభావం తగ్గుతుంది.
గురు, రవి , అంగారకుడితో సంబంధం ఉన్న రత్నాలను బంగారంతో మాత్రమే ధరించాలి. బృహస్పతి తన స్నేహితులపై శుభ దృష్టిని చూపిస్తాడు. అంటే, పుష్యరాగం, రూబీ, పగడపు ధరించడానికి మాత్రమే బంగారాన్ని ఉపయోగించండి.