Astro Tips: ఈ 4 రాశులకు చెందిన మగవారు ఒత్తిడిని వంట చేసి పోగొట్టుకుంటారు.. భిన్నమైన రుచులను ట్రై చేస్తారు..

|

Nov 27, 2023 | 3:55 PM

ముఖ్యంగా చాలామంది తమకు కష్టాలు వచ్చినా.. అయిష్టమైన పని జరిగినా, ఒత్తిడికి గురైనా మూడ్ ని మార్చుకోవడానికి రకరకాల పనులు చేస్తారు. తోట పని, వంట పని , కుట్లు అల్లికలు ఇలా రకరకాల పనులను చేసి తమని తామే ఎంగేజ్ చేసుకుంటారు. అయితే నాలుగు రాశులకు చెందిన మగవారు మాత్రం ఎక్కువగా ఒత్తిడికి గురైనా.. కలత చెందినా వంటనే వంట చేయడానికి ఆసక్తిని చూపిస్తారట. ఆ నాలుగు రాశులకు చెందిన పురుషులు ఎవరో ఈ రోజు తెలుసుకుందాం.. 

Astro Tips: ఈ 4 రాశులకు చెందిన మగవారు ఒత్తిడిని వంట చేసి పోగొట్టుకుంటారు.. భిన్నమైన రుచులను ట్రై చేస్తారు..
Astro Tips
Follow us on

మనుషుల నడవడిక, ఆలోచనలు, అలవాట్లు ఏ ఒక్కరిలోనూ ఒకలా ఉండవు. ముఖ్యంగా కొందరు తమను బాధపెట్టే ఏ చిన్న సంఘటన జరిగినా సరే ముఖం చిన్నబుచ్చుకుని ఓ చోటకు వెళ్లి కూర్చుంటే.. మరికొందరు తమని తాము హ్యాపీగా ఉంచుకునే విధంగా భిన్నమైన పనులపై దృష్టిని సారిస్తారు. ఇలా చేయడానికి కూడా రాశుల ప్రభావం ఉంటుందని జ్యోతిష్యశాస్త్రంలో పేర్కొంది. ముఖ్యంగా చాలామంది తమకు కష్టాలు వచ్చినా.. అయిష్టమైన పని జరిగినా, ఒత్తిడికి గురైనా మూడ్ ని మార్చుకోవడానికి రకరకాల పనులు చేస్తారు. తోట పని, వంట పని , కుట్లు అల్లికలు ఇలా రకరకాల పనులను చేసి తమని తామే ఎంగేజ్ చేసుకుంటారు. అయితే నాలుగు రాశులకు చెందిన మగవారు మాత్రం ఎక్కువగా ఒత్తిడికి గురైనా.. కలత చెందినా వంటనే వంట చేయడానికి ఆసక్తిని చూపిస్తారట. ఆ నాలుగు రాశులకు చెందిన పురుషులు ఎవరో ఈ రోజు తెలుసుకుందాం..

మకర రాశి: ఈ రాశికి చెందిన వారు భావోద్వేగాలను కలిగి ఉంటారు. పోషణ స్వభావం అధికం. తాము  బాధపడినప్పుడు వెంటనే వంట చేయడానికి ఆసక్తిని చూపిస్తారు. వంటగదిలో ఓదార్పుని పొందుతారు. ఇంకా చెప్పాలంటే.. ఈ రాశికి చెందిన వారు తమ కేరింగ్, ప్రేమను ఇతరులకు తెలియజేయడానికి రుచికరమైన ఆహారాన్ని అందించి తెలియజేయడానికి ఇష్టపడతారు. వీరు తమకు మాత్రమే కాదు చుట్టుపక్కల వారికి  అందించడానికి ఎక్కువగా చాక్లెట్, కుకీలను ఇవ్వడానికి ఆసక్తిని చూపిస్తారు.

వృషభ రాశి: ఈ రాశికి చెందిన వారు ఇంద్రియాలతో బలమైన సంబంధాన్ని కలిగి ఉంటారు. వంట చేయడాన్ని అత్యంత ఇష్టమైన పనిగా భావిస్తారు. జీవితంలో ఎదురైన ఒత్తిళ్ల నుంచి బయటపడడానికి,  విశ్రాంతి తీసుకోవడానికి ఈ రాశికి చెందినవారు వంట చేయడం ఒక మార్గంగా భావిస్తారు. ఇంట్లో తయారుచేసిన కేక్ ను ఇతరులకు గిఫ్ట్ గా ఇవ్వడం అనేది వీరికి అత్యంత ఇష్టమైన పని.

ఇవి కూడా చదవండి

కన్య రాశి: ఈ రాశికి చెందిన వారు పరిపూర్ణమైన వ్యక్తిత్వం గలవారు. రకరకాల వంటలను చేస్తూ తమ ఆందోళన నుంచి బయటపడతారు. నచ్చిన ఆహారాన్ని వండుతూ ఆందోళనను మనస్సును తీసివేసి, పనిపై దృష్టిని పెడతారు. వీరు చేసే వంటలు కూడా ఖచ్చితంగా ఒక రెసిపీని అనుసరించి చేస్తారు. అంతేకాదు ప్రతి కొలత ఖచ్చితమైనదని నిర్ధారించుకుని రుచికరమైన ఆహారాన్ని వండి తమ శ్రమకు తగిన ఫలం దక్కిందని  ఆనందిస్తారు. మొత్తానికి ఈ రాశికి చెందినవారికి వంట అనేది అద్భుతమైన మూడ్ లిఫ్టర్.

మీన రాశి: ఈ రాశికి చెందినవారు సృజనాత్మకంగా..  కలలు కనేవారుగా ఉంటారు. కుకింగ్ అంటే ఇష్టం ఉన్నా ఎక్కువగా రకరకాల కేక్‌లను తయారు చేసి అలంకరించడం ఇష్టం.. లేదా వంటల్లో విభిన్న రుచులతో ప్రయోగాలు చేస్తారు. కళాత్మకంగా వంటలను చేయడానికి అన్వేషిస్తారు. కలత చెందినప్పుడు మంచి అనుభూతిని అందించే రుచికరమైన వంటలను తయారు చేయడానికి వంటగది వైపు దృష్టి సారిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు