April 2024 Astrology
ఏప్రిల్ నెలలో నాలుగు గ్రహాలు రాశులు మారబోతున్నాయి. బుధ, రవి, శుక్ర, కుజుల రాశుల మార్పు వల్ల వృషభం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, మకర రాశుల వారికి అనేక శుభ యోగాలు అనుభవానికి రావడం జరుగుతుంది. ముఖ్యంగా జీవితంలో కొన్ని ముఖ్యమైన సాను కూల మార్పులు చోటు చేసుకుంటాయి. శుభ పరిణామాలు సంభవించడానికి అవకాశముంది. ఏప్రిల్ మాసమంతా వీరికి యోగకాలంగా గడిచిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి కావడం, ఆర్థిక లాభాలు చేకూరడం, వివాదాలు పరిష్కారం కావడం, పదోన్నతులు వంటివి సంభవించే అవకాశముంది.
- వృషభం: ఈ రాశివారి జీవితం అనేక విధాలుగా మారిపోతుంది. ఈ నాలుగు గ్రహాల రాశి మార్పు వీరికి బాగా అనుకూలంగా ఉండబోతున్నందువల్ల, ప్రతి పనీ, ప్రతి వ్యవహారమూ లాభదాయకంగా పూర్తవుతుంది. ఉద్యోగంలో ఇంత కాలంగా పెండింగులో ఉన్న పదోన్నతులు ఇప్పుడు చోటు చేసుకుంటాయి. జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో తీరిక ఉండదు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమవుతుంది. కెరీర్ పరంగా ఆశించిన శుభవార్తలు వినడం జరుగుతుంది.
- మిథునం: ఈ రాశికి శుభ స్థానాల్లో గ్రహాల మార్పు జరుగుతున్నందువల్ల, అనేక విధాలుగా శుభ వార్తలు వినడం, జీవితం సుఖ సంతోషాలతో గడిచిపోవడం, అన్ని విధాలుగానూ అనుకూల పరిస్థితులుం డడం వంటివి జరుగుతాయి. పెండింగులో ఉన్న శుభ కార్యాలు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. పదోన్నతికి అవకాశముంది. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అంది వస్తాయి. ఉద్యోగం మారే సూచనలు కూడా ఉన్నాయి. విదేశీ అవకాశాలు బాగా అందివస్తాయి.
- సింహం: గ్రహాల రాశి మార్పు వల్ల ఈ రాశివారికి దాదాపు విపరీత రాజయోగం పట్టబోతోంది. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో గౌరవాభిమానాలు పెరుగుతాయి. ప్రతిభా పాట వాలు వెలుగులోకి వస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రులు అనేక విధాలుగా ఈ రాశివారి మీద ఆధారపడతారు. ఆదాయం అంచనాలకు మించి పెరుగుతుంది. అనుకోకుండా సంపద కలిసి వస్తుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది.
- తుల: ఈ రాశివారికి నాలుగు గ్రహాల రాశి మార్పు బాగా అనుకూలంగా ఉంటుంది. ఆకస్మికంగా, అప్రయత్నంగా ధనం కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ రాశుల మార్పులో భాగంగా రాశినాథుడు శుక్రుడు ఉచ్ఛపడుతున్నందువల్ల ఈ రాశివారికి అనేక అనుకూలతలు ఏర్పడతాయి. అనేక విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది. ఏ రంగానికి చెందిన వారైనప్పటికీ ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఉద్యోగంలోనూ, ఆర్థికంగానూ తప్పకుండా స్థిరత్వం లభిస్తుంది.
- ధనుస్సు: ఈ రాశివారికి ఏప్రిల్ 30 వరకూ ఆదాయపరంగా కలిసి వస్తూనే ఉంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. సర్వత్రా గౌరవాభిమానాలు ఏర్పడతాయి. ఆరోగ్య బలం కూడా చేకూరుతుంది. ఇంట్లో శుభ కార్యాలు చేసే అవకాశం ఉంది. ఒకటి రెండు కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. ఆశించిన పెళ్లి సంబంధం ఖాయమవుతుంది.
- మకరం: ఈ రాశివారికి దాదాపు ప్రతి గ్రహమూ అనుకూలంగా మారబోతోంది. అనేక విధాలుగా కలిసి వస్తుంది. ముఖ్యంగా అనేక మార్గాల్లో సంపాదన పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా అధికార యోగం పడుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. శత్రువులు, పోటీదార్లు తొలగిపోతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విదేశీయానానికి, విదేశాల్లో వృత్తి, ఉద్యో గాలపరంగా స్థిరత్వానికి అవకాశం ఉంది. ఒకటి రెండు కీలకమైన శుభ పరిణామాలు సంభవిస్తాయి.