Amavasya Horoscope: అమావాస్యతో ఆ రాశుల వారికి అరుదైన యోగాలు.. అందులో మీ రాశి ఉందా?

| Edited By: Janardhan Veluru

Oct 29, 2024 | 3:04 PM

అక్టోబర్ నెల 31, నవంబర్ 1,2 తేదీల్లో తులా రాశిలో సంభవించబోయే అమావాస్య కొన్ని రాశులకు అరుదైన యోగాలను తీసుకొచ్చే అవకాశముంది. రవి, చంద్రుల యుతిని అమావాస్యగా భావిస్తారు. రవి, చంద్రులు తులా రాశిలో కలవడం వల్ల, ఇది చంద్రుడికి ఎంతో ఇష్టమైన శుక్రుడి రాశి కావడం వల్ల ఈ అమావాస్య ప్రత్యేకత సంతరించుకుంది. కొన్ని రాశుల వారికి ఈ మూడు రోజుల్లోనూ అనేక శుభ ఫలితాలు అనుభవానికి వచ్చే అవకాశం ఉంది.

Amavasya Horoscope: అమావాస్యతో ఆ రాశుల వారికి అరుదైన యోగాలు.. అందులో మీ రాశి ఉందా?
Amavasya Horoscope
Follow us on

ఈ నెల 31, నవంబర్ 1,2 తేదీల్లో తులా రాశిలో సంభవించబోయే అమావాస్య కొన్ని రాశులకు అరుదైన యోగాలను ఇచ్చే అవకాశం ఉంది. జ్యోతిషశాస్త్రంలో రవి, చంద్రుల యుతిని అమావాస్యగా భావిస్తారు. ఈ రెండు గ్రహాలు తులా రాశిలో కలవడం వల్ల, ఇది చంద్రుడికి ఎంతో ఇష్టమైన శుక్రుడి రాశి కావడం వల్ల ఈ అమావాస్య ప్రత్యేకత సంతరించుకుంది. కొన్ని రాశుల వారికి ఈ మూడు రోజుల్లోనూ అనేక శుభ ఫలితాలు అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. మేషం, మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, మకర రాశుల వారు ఈ అమావాస్య రోజుల్లో శుభ యోగాలను అనుభవించడం జరుగుతుంది.

  1. మేషం: ఈ రాశికి సప్తమ స్థానంలో చంద్ర, రవుల కలయిక వల్ల తప్పకుండా రాజయోగం కలుగుతుంది. ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. పదోన్నతి లభించే అవకాశం కూడా ఉంది. ఇంటా బయటా మంచి గుర్తింపు లభిస్తుంది. కీర్తి ప్రతిష్ఠలు వృద్ధి చెందుతాయి. ఆగిపోయిన పనులన్నీ పూర్తవు తాయి. ఆదాయ ప్రయత్నాలు ఊపందుకుంటాయి. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. రాజకీయ వర్గాలతో పరిచయాలు వృద్ధి చెందుతాయి.
  2. మిథునం: ఈ రాశికి పంచమ స్థానంలో అమావాస్య ఏర్పడడం వల్ల ఆదాయానికి సంబంధించి ఏ ప్రయత్నం చేపట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. పిల్లలు బాగా పురోగతి చెందుతారు. మీ ప్రతిభా పాటవాలకు, సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో ప్రాభవం, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది.
  3. కర్కాటకం: రాశినాథుడైన చంద్రుడు చతుర్థ స్థానంలో రవితో కలవడం రాజయోగానికి దారితీస్తుంది. పైగా ఇక్కడ చంద్రుడికి దిగ్బలం పట్టడం వల్ల మనసులోని ప్రధానమైన కోరికలు, ఆశలు నెరవేరే అవకాశం ఉంటుంది. అనారోగ్యాల నుంచి ఆశించిన ఉపశమనం లభిస్తుంది. ఈ మూడు రోజుల్లో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా, ఎటువంటి కార్యక్రమం చేపట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. సొంత ఇంటి కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. సామాజికంగా వైభం పెరుగుతుంది.
  4. తుల: ఈ రాశిలో రవి, చంద్రుల కలయిక వల్ల తప్పకుండా రాజయోగం పడుతుంది. నిరుద్యోగులకు విదే శాల నుంచి కూడా ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నత స్థానాలకు వెళ్లడం జరుగు తుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. ఆరోగ్యంలో ఆశించిన మెరుగుదల ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా వృద్ధి చెందుతుంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు కలుగుతాయి. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది.
  5. ధనుస్సు: ఈ రాశికి లాభ స్థానంలో రవి, చంద్రుల కలయిక వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతికి, వృత్తి, వ్యాపారాల్లో అత్యధిక రాబడికి బాగా అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తి సూచనలున్నాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఉన్నత స్థాయి జీవితం లభిస్తుంది. నిరుద్యోగులకు ఊహించని ఉద్యో గావకాశాలు లభిస్తాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది.
  6. మకరం: ఈ రాశికి దశమ స్థానంలో రవి, చంద్రుల కలయిక వల్ల ఉద్యోగపరంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పదోన్నతికి, వేతనాల పెరుగుదలకు అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోవడానికి అవకాశం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా కార్యకలాపాలు విస్తరి స్తాయి. నిరుద్యోగులు విదేశాల్లో ఉద్యోగానికి సంబంధించి సానుకూల సమాచారం అందుకుంటారు. ఉద్యోగులకు కూడా అవకాశాలు అందివస్తాయి. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది.