Vinayaka Chavithi: దేశ వ్యాప్తంగా గణేష్ చతుర్థి పండుగను పిల్లలు, పెద్దలు ఆనందంగా, ఆనందంగా జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగష్టు 31వ తేదీన గణేష్ చతుర్థి పర్వదినం జరుపుకోనున్నారు. హిందువుల ఇళ్లలో మాత్రమే కాదు.. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ ఈ పండుగ ఇప్పుడు దేశమంతటా జరుపుకోనున్నారు. ఈ నేపధ్యంలో ఏ రాశివారికి ఏ రంగు గణపతి విగ్రహం .. సుఖ సంపదలను ఇస్తుందో ఈరోజు తెలుసుకుందాం..
మేష రాశి: ఈ రాశి వారు తమ ఇంటికి గులాబీ లేదా ఎరుపు రంగులో ఉన్న గణపతి విగ్రహాన్ని పూజించాలి. సమయంలో లడ్డూను నైవేద్యంగా సమర్పించాలి.
వృశ్చిక రాశి: ఈ రాశి వారు తమ ఇంటికి ముదురు ఎరుపు రంగు గణపతి విగ్రహాన్నిఏర్పాటు చేసుకోవాలి. లడ్డూ , మోతీచూర్ని ప్రసాదంగా పెట్టవచ్చు.
మిథునరాశి: ఈ రాశి వారు లేత ఆకుపచ్చ గణపతి విగ్రహాన్ని ఇంటిలో ప్రతిష్టించాలి. ప్రసాదంగా మోదకాన్ని గణపయ్యకు నివేదించవచ్చు.
కన్య రాశి: ఈ రాశి వారు తమ ఇంటిలో ముదురు ఆకుపచ్చ గణపతి విగ్రహాన్నిఏర్పాటు చేసుకోవచ్చు. నారింజ రంగు లడ్డూను ప్రసాదంగా సమర్పించాలి.
వృషభ రాశి: ఈ రాశి వారు లేత పసుపు గణపతి విగ్రహాన్ని ఇంటిలో ఏర్పాటు చేసుకోవాలి.
తులారాశి: ఈ రాశి వారు తెల్ల గణపతి విగ్రహాన్ని ఇంటికి తీసుకురావాలి. ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించవచ్చు.
మీన రాశి: ఈ రాశి వారు తమ ఇంటికి పసుపు గణపతి విగ్రహాన్ని తెచ్చి ఎర్రటి పూలతో అలంకరించి మోదకాన్ని నైవేద్యంగా సమర్పించాలి.
మకర రాశి: ఈ రాశి వారు తమ ఇంటికి లేత నీలం రంగులో ఉండే గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజించాలి. మోదకం నైవేద్యంగా సమర్పించాలి.
సింహ రాశి: ఈ రాశికి చెందిన వారు తమ ఇంటికి గంధ సింధూరం రంగు గణపతి విగ్రహాన్ని పూజించాలి.
కర్కాటక రాశి: ఈ రాశి వారు తమ ఇంటికి తెల్లటి గణపతి విగ్రహాన్ని పూజించాలి. మోతీచూర్ లడ్డూని నైవేద్యంగా సమర్పించాలి.
ధనుస్సు రాశి: ఈ రాశి వారు పసుపు గణపతి విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చి పసుపు పూలతో అలంకరించుకోవాలి.
కుంభ రాశి: ఈ రాశి వారు తమ ఇంటిలో ముదురు నీలం రంగు గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజించాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)