Breaking News
  • వరంగల్ జిల్లా న్యాయస్థానం సంచలన తీర్పు. గొర్రెకుంటలో తొమ్మిదిమందిని జలసమాధి చేసిన మానవ మృగం సంజయ్ కుమార్ యాదవ్ కి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెల్లడి చేసిన జిల్లా సెషెన్స్ జడ్జ్ జయకుమార్. ఉరిశిక్ష విధించడం పట్ల హర్షం వ్యక్తంచేసిన న్యాయవాదులు, జిల్లా ప్రజలు.
  • డాక్టర్ హుస్సేన్: నిన్న మధ్యాహ్నం ఒంటిగంటకు ఐదుగురు బుర్కా వేసుకొని క్లినిక్ లోకి వచ్చారు. రావడంతోనే నాపై దాడి చేశారు.. వారినుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాను. ఆ క్రమంలో నా చేతికి గాయం అయింది. నా ఇనోవా కారు రివర్స్ తీసుకొచ్చి అందులో ఎక్కించారు. కొద్దిదూరం తీసుకెళ్లిన తర్వాత ఆటోలో కి మార్చారు. ఆ తర్వాత ఒక రూమ్ లోకి నన్ను తీసుకెళ్లారు. అక్కడి నుండి బొలెరో వెహికల్ లో తీసుకువచ్చారు. నువ్వు మాకు సహకరిస్తే నిన్ను ఏమి చేయమని చెప్పారు. తర్వాత తాళ్లతో కట్టేసి ముఖానికి మాస్క్ పెట్టారు.
  • అనంతపురం :హైదరాబాద్ లో కిడ్నా ప్ అనంతలో చేజింగ్ .డాక్టర్ హుస్సేన్ ను కిడ్నాపర్ల నుంచి రక్షించిన అనంతపురం జిల్లా పోలీసులు .హైదరాబాద్ ఎక్సైజ్ కాలనీలో దంత వైద్యుడు హుస్సేన్ నిన్న కిడ్నాప్ చేశారు. అనంతపురం మీదుగా బెంగళూరుకు వెళ్తుండగా కిడ్నాప్ గ్యాంగ్ ను అనంతపురం పోలీసులు పట్టుకున్నారు. అనంతపురం జిల్లాలో అన్ని చెక్ పోస్టులను అలర్ట్ చేసిన ఎస్పీ సత్యయేసుబాబు. డాక్టర్ హుస్సేన్ ను రక్షించిన అనంతపురం జిల్లా పోలీసులు .ఇద్దరు దుండగులు పరారీ. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
  • సైబరాబాద్ కిడ్నాపర్లను పట్టుకున్న అనంతపురమ్ పోలీసులు . డెంటిస్ట్ హుస్సేన్ ను కిడ్నాపర్ల నుంచి రక్షించిన అనంతపురం పోలీసులు. హైదరాబాద్ ఎక్సైజ్ కాలనీలో దంత వైద్యుడు హుస్సేన్ కిడ్నాప్. అనంతపురం జిల్లాలో అన్ని చెక్ పోస్టులను అలర్ట్ చేసిన ఎస్పీ సత్యయేసుబాబు. అనంతపురం మీదుగా బెంగళూరుకు వెళ్తున్న కిడ్నాప్ గ్యాంగ్. డాక్టర్ హుస్సేన్ ను రక్షించిన పోలీసులు. ఇద్దరు దుండగులు పరారీ. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
  • వరంగల్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 9హత్యల కేసులో నేడు తుది తీర్పు. నిందితుడికి ఉరి లేదా యావజ్జీవ శిక్ష పడే అవకాశం. గత మే 21న వరంగల్ నగర శివారులోని గొర్రెకుంట సాయి దత్త గన్ని బ్యాగ్స్ కంపెనీ లో 9మందికి మత్తు ఇచ్చి సృహ కోల్పోయిన తర్వాత సజీవంగా బావిలో పడిసి హత్యలు చేసిన నిందితుడు. ఈ కేసులో నిందితుడు బీహార్ కి చెందిన సంజయ్ కుమార్ యాదవ్ కు నేడు శిక్ష ఖరారు చేయనున్న సెషన్స్ కోర్టు న్యాయమూర్తి. నిందితుడి పై 7సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసిన పోలీసులు. నెల రోజుల్లో కోర్ట్ లో చార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు.
  • తిరుమల: నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.22 కోట్లు. శ్రీవారిని దర్శించుకున్న 20,315 మంది భక్తులు. తలనీలాలు సమర్పించిన 7,145 మంది భక్తులు. నిన్న నవంబర్ నెల రూ.300 దర్శన టికెట్ల కోటాను విడుదల చేసిన టీటీడీ. నవంబర్ మొదటివారం నుండి ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను వర్చువల్ విధానంలో నిర్వహించాలని టీటీడీ నిర్ణయం. ఏడు నెలల తర్వాత ఆలయం వెలుపలకు రానున్న మలయప్పస్వామి.
  • దేశ రాజధాని ఢిల్లీలో కొనసాగుతున్న వాయు కాలుష్యం. ఆనంద్ విహార్, ఆర్కేపురం, పట్‌పట్‌గంజ్ సహా పలు ప్రాంతాల్లో అధిక తీవ్రత. ఎయిర్ క్వాలిటీ ఇండెక్సులో 300కు పైగా నమోదు.
  • బిహార్‌ ఔరంగాబాద్ జిల్లాలో ఐఈడీ బాంబుల కలకలం. రెండు ఐఈడీలను స్వాధీనం చేసుకున్న సీఆర్పీఎఫ్. బాంబులను సురక్షితంగా నిర్వీర్యం చేసిన బలగాలు. మావోయిస్టులు అమర్చిన బాంబులుగా గుర్తించిన పోలీసులు. ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన మావోయిస్టులు. మావోయిస్టుల హెచ్చరికల నేపథ్యంలో భారీగా భద్రతా ఏర్పాట్లు. 1200 ప్లటూన్ల కేంద్ర పారామిలటరీల బలగాల వినియోగం. తొలి విడత ఎన్నికల్లో మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలు.

అక్కడ ఎవరు గెలిస్తే వారిదే ఏపీలో అధికారం

, అక్కడ ఎవరు గెలిస్తే వారిదే ఏపీలో అధికారం

విజయవాడ: ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారనే రాజకీయ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారింది. అయితే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా కూడా ఏపీపై ప్రత్యేక చూపు ఉంది. ఒక పక్క చంద్రబాబు, మరోపక్క జగన్ అధికారం కోసం ఢీ కొడుతున్నారు. పవన్ కళ్యాణ్ వీరికి గట్టి పోటీ ఇస్తున్నారు.

అయితే ఏపీలో గెలుపోటములను ప్రభావితం చేసే అంశాలు చాలా ఉన్నాయి. వాటిలో కీలక భూమిక మాత్రం కుల సమీకరణాలదే. టీడీపీ, వైసీపీలు కులాల వారీగా వ్యూహాలు రచిస్తున్నాయి. కుల సంఘాల నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఎవరి వ్యూహాలు వారికి ఉన్నప్పటికీ ఏపీలో రాజకీయపరంగా గోదావరి జిల్లాలకు మాత్రం అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఇక్కడ ఎవరు పైచేయి సాధిస్తే వారే రాష్ట్రంలో అధికారంలోకి వస్తారనే నానుడి చాలా కాలంగా ఉంది. పలు ఎన్నికల్లో ఇది రుజువైంది కూడా. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు గోదావరి ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారిస్తాయి.

అయితే గోదావరి జిల్లాల్లో ఉంటుందనుకుంటున్న ప్రభావం శ్రీకాకుళం నుంచి పశ్చిమగోదావరి వరకూ  చూడొచ్చని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం అధికంగా ఉంటుంది. వీళ్లు కొన్నిసార్లు టీడీపీకి, కొన్నిసార్లు కాంగ్రెస్‌కు మద్దతుగా ఉన్నారు.

టీడీపీ, వైసీపీతో పాటు జనసేన చేస్తున్న ప్రయత్నం రాజకీయ సమీకరణాల్లో కీలకమయ్యే అవకాశముంది. గత ఎన్నికల్లో గోదావరి జిల్లాల ప్రజలు టీడీపీ వైపు మొగ్గు చూపారు. మరి ఈసారి ఎవరికి మద్దతు తెలుపుతారోననే ఆసక్తి నెలకొంది. అందుకే అటు టీడీపీ, ఇటు వైసీపీ, ఇంకోవైపు జనసేన ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. గోదావరిలో ఎవరిది పైచేయి అవుతుందో వారికే అధికారం దక్కుతుందనే మాట ఈసారి ఏ విధంగా రుజువౌతుందో వేచి చూడాల్సిందే.

Related Tags