Breaking News
  • ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని మార్చే హక్కు ఎవరికీ లేదు. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి ఒప్పుకుంటేనే హైకోర్టు కదులుతుంది-కేశినేని. అమరావతి రక్షణకు పార్లమెంటు వేదికగా పోరాటం చేస్తాం-కేశినేని.
  • చిత్తూరు: తిరుచానూరు పీఎస్‌ నుంచి బేడీలతో పరారైన దొంగ. ట్రాక్టర్‌ దొంగతనం కేసులో నాగరాజును అరెస్ట్‌చేసిన పోలీసులు. దొంగ నాగరాజు కోసం గాలిస్తున్న పోలీసులు.
  • ఢిల్లీ: ఆప్‌ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు. నిర్భయ దోషులను రక్షించేందుకు ఆప్‌ ప్రభుత్వం యత్నిస్తోంది. కావాలనే న్యాయ ప్రక్రియను ఆలస్యం చేస్తోంది-మనోజ్‌ తివారీ. పోలీసులు తమ పరిధిలో లేరని తప్పించుకోవాలని ఆప్‌ చూస్తోంది -బీజేపీ ఢిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారీ.
  • అనంతపురం: తాడిపత్రిలో కత్తిపోట్లు. డబ్బుల విషయంలో స్నేహితుల మధ్య ఘర్షణ. రాము అనే వ్యక్తిని కత్తితో పొడిచిన రవితేజ. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన రాము.
  • రైతులు కన్నీళ్లు పెట్టినా సీఎం మనసు కరగడం లేదు. రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోంది-దేవినేని ఉమ. విశాఖలో భూదందా నడుస్తోంది-మాజీ మంత్రి దేవినేని ఉమ. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం రాజధానిని విశాఖకు తరలిస్తున్నారు. పులివెందుల పులి డమ్మీ కాన్వాయ్‌తో వెళ్తోంది. దేశ చరిత్రలో డమ్మీ కాన్వాయ్‌తో వెళ్లిన సీఎం చరిత్రలో లేరు. సచివాలయానికి వెళ్లేందుకు మెటల్‌ రోడ్డు వేసుకుంటున్నారు. 5 కోట్ల మంది ప్రజలు రేపు రోడ్లపైకి రావాలి-దేవినేని ఉమ.

సీనియర్ ఓవైసీకి సీరియస్ సమస్య

asaduddin love story trending, సీనియర్ ఓవైసీకి సీరియస్ సమస్య

స్థానికాంశాలతోపాటు జాతీయ, అంతర్జాతీయాంశాలపై ఏ వేదిక మీదనైనా అనర్గళంగా మాట్లాడే ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి పెద్ద కష్టమొచ్చి పడింది. అసదుద్దీన్ ఓ జాతీయ మీడియా ప్రతినిధితో ప్రేమలో వున్నాడంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. దాంతో ఆయన, ఆయన పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. సీరియస్ పొలిటీషియన్‌పై ఇంత నీచంగా ప్రచారం ఏంటని సాక్షాత్తు సీనియర్ ఓవైసీ మండిపడ్డారు.

ఆయన అసదుద్దీన్‌ ఒవైసీ.. మజ్లిస్‌పార్టీ అధినేత. దేశమంతా తెలిసిన వ్యక్తి. నిరంతరం వార్తల్లో కనిపిస్తారు. తాజా పరిణామాల మీద తన పార్టీ వాయిస్‌ వినిపిస్తారు. జాతీయ అంతర్జాతీయ చానెళ్లకు ఇంటర్‌వ్యూలిస్తారు. ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటారు.

రాజకీయనాయకులన్న తర్వాత మీడియాతో మాట్లాడటం, ఇంటర్వ్యూలివ్వటం సర్వసాధారణం. చానెళ్లు లేదా పత్రికలు, ఒక్కో పార్టీ బీట్‌ను ఒక్కొక్కరికి కేటాయిస్తాయి. దీంతో విధి నిర్వహణలో భాగంగా ఒకే రిపోర్టర్‌ లేదా ఒకే యాంకర్‌ ఒక్కోనాయకుడిని పలుమార్లు ఇంటర్వ్యూలు చేయడం, అభిప్రాయాలు తీసుకోవటం మామూలే !

ఒక జాతీయ చానెల్‌ యాంకర్‌ కూడా అసదుద్దీన్‌ను పలుమార్లు ఇంటర్వ్యూ చేశారు. ఆ క్లిప్పింగులన్నీ తీసుకుని వారిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్టుగా సోషల్‌మీడియాలో ప్రచారం చేస్తున్నారు. వాయిస్‌ మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తూ, తమ మానసిక వికారాలను బయట పెట్టుకుంటున్నారు. ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తికి సంబంధించినవి కావటంతో వీరిద్దరిపై టిక్ టాక్‌లో చేసిన వీడియోలు జాతీయస్థాయిలో దుమారం రేపుతున్నాయి. సోషల్‌ మీడియాలో నడుస్తున్న ఈ నీచమైన ట్రెండ్‌పై మజ్లిస్‌ నేతలు సీరియస్‌ అవుతున్నారు.

సోషల్‌ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ మండిపడ్డారు. అందరికీ అక్క చెల్లెళ్లు ఉన్నారనీ, ఏ మహిళ గురించి కూడా ఇలా తప్పుగా రాయకూడదన్నారు. తన రాజకీయాల మీద, ప్రసంగాల మీద ఏమైనా రాసుకోవచ్చనీ, మహిళలను కించపరచటం మంచి పద్ధతి కాదని హితవు చెప్పారు. ఇటువంటి నీచ సంస్కృతిని సహించొద్దన్నారు.

వాళ్లూ వీళ్లూ అని లేదు, సామాన్యుల దగ్గర్నుంచి సెలబ్రిటీలవరకూ సోషల్‌ మీడియా బాధితులు రోజురోజుకీ పెరుగుతున్నారు. సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్‌కి వచ్చే ఫిర్యాదుల్లో 70శాతం విద్యార్థినులను, యువతులను వేధిస్తున్నవేనని పోలీసు అధికారులు చెబుతున్నారు. బాధితులు తమకు చూపిస్తున్న ఫోటోల్లో కొన్ని మార్ఫింగ్‌ చేసినవి ఉన్నప్పటికీ , 20 శాతం వరకూ నిజమైనవి ఉంటాయంటున్నారు.