AP Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 125 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 42,809 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 125 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,87,591కి

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 42,809 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 125 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,87,591కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ శుక్రవారం రిలీజ్ చేసిన బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో కరోనాతో ఏ ఒక్కరూ మృతిచెందకపోవడం ఊరటనిచ్చే విషయం. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా మృతుల సంఖ్య 7,152గా ఉంది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 175 మంది పూర్తిగా కోలుకోగా.. మొత్తం రికవరీల సంఖ్య 8,79,131కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,308 యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,30,54,959 కరోనా శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు తెలిపింది.
#COVIDUpdates: 29/01/2021, 10:00 AM రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,84,696 పాజిటివ్ కేసు లకు గాను *8,76,236 మంది డిశ్చార్జ్ కాగా *7,152 మంది మరణించారు * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,308#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/d0bJoSYPLM
— ArogyaAndhra (@ArogyaAndhra) January 29, 2021
Also Read:
Madanapalle double murder: మదనపల్లె మర్డర్స్.. తిరుపతి రుయాకు నిందితులు.. డాక్టర్లు ఏం చెప్పారంటే..?