రాజ్యసభ ఎన్నికలపై వైసీపీ స్పెషల్ ఫోకస్.. అభ్యర్ధుల ప్రకటనపై కొనసాగుతోన్న ఉత్కంఠ..

రాజ్యసభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది వైసీపీ. రాజ్యసభ ఎన్నికలకు రేపు నోటిఫికేషన్‌ విడుదలకానుండటంతో తమ పార్టీ అభ్యర్థులను అధికారికంగా ఏ క్షణంలో అయినా ప్రకటించే అవకాశం ఉంది. ఏపీలో ఖాళీ అవుతున్న మూడు సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించారు వైసీపీ అధినేత, సీఎం జగన్.

రాజ్యసభ ఎన్నికలపై వైసీపీ స్పెషల్ ఫోకస్.. అభ్యర్ధుల ప్రకటనపై కొనసాగుతోన్న ఉత్కంఠ..
YSRCP

Updated on: Feb 07, 2024 | 10:00 AM

రాజ్యసభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది వైసీపీ. రాజ్యసభ ఎన్నికలకు రేపు నోటిఫికేషన్‌ విడుదలకానుండటంతో తమ పార్టీ అభ్యర్థులను అధికారికంగా ఏ క్షణంలో అయినా ప్రకటించే అవకాశం ఉంది. ఏపీలో ఖాళీ అవుతున్న మూడు సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించారు వైసీపీ అధినేత సీఎం జగన్. మూడు స్థానాలకు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడ రఘునాథ్‌రెడ్డి పేర్లు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ప్రకటన తర్వాత.. ఈ నెల 8న మాక్‌ పోలింగ్ నిర్వహించే యోచనలో ఉంది వైసీపీ అధిష్ఠానం. వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, టీడీపీ నుంచి కనకమేడల రవీంద్రబాబు, బీజేపీ నుంచి సీఎం రమేశ్‌బాబు పదవీకాలం ఏప్రిల్‌లో అయిపోతుంది. వీరితో పాటు దేశవ్యాప్తంగా 56 ఖాళీలు ఏర్పడుతున్నాయి. దీంతో ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించనుంది ఎలక్షన్ కమిషన్.

ఒక్కో రాజ్యసభ మెంబర్‌కు 44 ఓట్లు అవసరం కాగా.. 151మంది ఎమ్మెల్యేలతో మూడు స్థానాల్లో వైసీపీ ఈజీగా గెలవనుంది. మూడు స్థానాల్లో గెలుపుతో.. రాజ్యసభలో వైసీపీ బలం 11కు చేరనుంది. అధికార పార్టీకి చెందిన రెబల్ ఎమ్మెల్యేలు, అసంతృప్తులను నమ్ముకుని సరిపడా బలం లేకున్నా అభ్యర్థిని బరిలో దింపే ఆలోచనలో ఉంది టీడీపీ. ఎమ్మెల్సీ ఎన్నికల లాగే రాజ్యసభలోనూ అభ్యర్థి పెట్టి గెలవాలని ఆలోచనలు చేస్తోంది. దీనిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే.. బీజేపీ-టీడీపీ పొత్తు కుదిరితే.. రాజ్యసభకు మరోసారి పోటీ చేస్తానని టీవీ9 బిగ్ న్యూస్, బిగ్ డిబేట్‌లో చెప్పారు ఎంపీ సీఎం రమేష్. ప్రస్తుతం టీడీపీకి 18మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. కానీ.. క్రాస్ ఓటింగ్ జరుగుతుందనే నమ్మకంతో.. అభ్యర్థిని పెట్టాలని చూస్తోంది టీడీపీ. ఒకవేళ పొత్తు కుదిరితే.. బీజేపీయే అభ్యర్థిని పెట్టే అవకాశం ఉంది.