YSRCP MLA: వైసీపీ ఎమ్మెల్యే ఉదారత.. సొంత డబ్బుతో రైతులకు ఉచితంగా ట్రాక్టర్ల పంపిణీ

ప్రజా ప్రతినిధులెవరైనా సాధారణంగా ఏం చేస్తారు. ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు.

YSRCP MLA:  వైసీపీ ఎమ్మెల్యే ఉదారత.. సొంత డబ్బుతో  రైతులకు ఉచితంగా ట్రాక్టర్ల పంపిణీ
Rachamallu

Updated on: Sep 08, 2021 | 7:17 PM

MLA Rachamallu Siva Prasad Reddy: ప్రజా ప్రతినిధులెవరైనా సాధారణంగా ఏం చేస్తారు. ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. తమ జేబు నుంచి ఒక్క రూపాయి కూడా పోవడానికి ఇష్టపడరు. కానీ, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి.. సొంత డబ్బుతో రైతులను ఆదుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 23 ట్రాక్టర్లను ఉచితంగా పంపిణీ చేశారు. 23 రైతు భరోసా కేంద్రాలకు 23 ట్రాక్టర్లను ఎమ్మెల్యే అప్పగించారు.

ఇవాళ కడప జిల్లా ప్రొద్దుటూరులోని వైయస్‌ఆర్‌ విగ్రహం దగ్గర బహిరంగ సభ ఏర్పాటు చేశారు. వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ సమావేశంలో మంత్రి కన్నబాబు, ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గొప్ప కార్యక్రమం చేపట్టారని అన్నారు. ఆయన ఎమ్మెల్యే కాకముందు నుంచి తన నియోజక ప్రజలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారని కొనియాడారు. మరో వైపు రాష్ట్ర​ ప్రభుత్వం విద్య , వైద్యం , వ్యవసాయ రంగంలో అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టిందని చెప్పారు.

ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. లోకేష్ రాబందులాగా శవాల కోసం ఏడురుచూస్తున్నాడని, రాష్ట్రంలో ఎక్కడ శవం కనిపించినా అక్కడ వాలిపోయి ప్రభుత్వాన్ని నిందించడమే పనిగా పెట్టుకున్నాడంటూ విమర్శించారు.

Read also: Vinayaka Chaturthi: రాయదుర్గంలో 14వ శతాబ్దం నాటి దశభుజ గణపతి. టెంకాయ స్వామి దగ్గర ఉంచితే..