CM YS Jagan Speech Highlights: వైఎస్సార్ ప్లీనరీ సమావేశాలు రెండో రోజు ముగిశాయి. రెండు రోజుల పాటు కొనసాగిన సమావేశాల్లో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, ప్రజలకు అందిన సహాయ సహకారాలు తదితర అంశాలను వెల్లడించారు. సభలో పలు తీర్మానాలు కూడా చేశారు. వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్‌ను ప్లీనరీలో తీర్మానం ప్రవేశపెట్టగా, ఇందుకు సభ్యులు ఆమోదం తెలిపారు. రెండు రోజుల పాటు జరిగిన ప్లీనరీలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, నేతల ప్రసంగాలతో కొనసాగింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కార్యకర్తలు పాల్గొని ప్రసంగాలను విన్నారు. తల్లి విజయమ్మతో కలిసి ప్లీనరీకి హాజరయ్యారు సీఎం జగన్. ముందుగా వైసీపీ జెండాను ఆవిష్కరించిన వైఎస్ జగన్.. తర్వాత వైఎస్‌ఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ప్రారంభోపన్యాసం చేశారు. ఇక వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి విజయమ్మ రాజీనామా చేసిన విషయం విధితమే. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్తున్నారన్నారు విజయమ్మ అన్నారు. ఇలాంటి సమయంలో జగన్ కన్నా తన అవసరం షర్మిలకే ఎక్కువ ఉందన్న ఆమె పార్టీని అందుకే వీడుతున్నట్లు ప్రకటించారు.
ఇక రెండో రోజు ప్లీనరీ సమావేశాలను రెట్టించి ఉత్సాహంతో నిర్వహించేందుకు వైసీపీ వర్గాలు సిద్ధమవుతున్నాయి. శనివారం ఉదయం 10 గంటలకు తీర్మానాలను ప్రారంభించనున్నారు. ఇందులో 5 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. సాయంత్రం 3.30 గంటలకు వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్‌ను ఎంచుకోనున్నారు. సాయంత్రం 4 గంటలకు జగన్ ముగింపు సందేశం ఇవ్వనున్నారు. రెండో రోజు సమావేశాల్లో సుమారు 2 లక్షల మంది హాజరవుతారని వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు.
రెండో రోజు కొనసాగిన వైఎస్సార్ సీపీ ప్లీనరీ సమావేశాలు ముగిశాయి. ఈ ప్లీనరీ 2022 సమావేశాలు ముగిసినట్లు పార్టీ అధికారికంగా ప్రకటించింది.
చంద్రబాబుకు ప్రజల పట్ల మమకారం, ప్రేమ అన్నది ఏమాత్రం లేదు. పేదలు ఎదగకూడదన్నదే చంద్రబాబు ఉద్దేశం.తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తారని, పేదల పిల్లలు మాత్రం తెలుగు మీడియమే చదవాలనేది చంద్రబాబు అభిమతమని జగన్ విమర్శించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రభుత్వ బడులను కార్పొరేట్ తీసుకెళ్లడానికి శ్రమిస్తోందని అన్నారు.
మూడేళ్లలో ఒక్క రైతు భరోసా ద్వారానే రూ.23875 కోట్లు అందించామని సీఎం జగన్ అన్నారు. సుమారు 50 లక్షల రైతు కుటుంబాలకు మేలు జరిగిందన్నారు. ఉచిత విద్యుత్ కోసం రూ.27వేల కోట్లు ఖర్చు చేశామని అన్నారు. ధాన్యం కొనుగోలు కోసం రూ.45వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. రైతులను గుండెల్లో పెట్టుకున్న ప్రభుత్వ మనదని అన్నారు.
రెండో రోజు ప్లీనరీ సమావేశాలకు లక్షలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. దీంతో జాతీయ రహదారిపై రోడ్డుకిరువైపులా నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. రహదారి మొత్తం బస్సులు, కార్లతో నిండిపోయాయి.
ప్లీనరీ రెండో రోజు సమావేశాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడారు. నాపై ఎప్పుడు కుట్రలు చేస్తూనే ఉన్నారని, ఏదీఏమైనా నా ఫోకస్ అంతా ప్రజలకు మంచి చేయడమేనని అన్నారు. నన్ను అన్యాయంగా అరెస్టు చేయించిన వాళ్లు నామ రూపాలు లేకుండా పోయిందని ఆరోపించారు.
వైసీపీ ప్లీనరీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఇక వైఎస్సార్ సీపీ శాశ్వత అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ప్రకటించారు. ఈ మేరకు ప్లీనరీలో తీర్మానం చేశారు.
ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లీనరీ రెండో రోజు కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ప్లీనరీ ప్రాంగణం కార్యకర్తలత నినాదాలతో హోరెత్తిపోతోంది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నేతల ప్రసంగాలను వింటున్నారు.
నవంబర్ నుంచి ఏపీ సీఎం జగన్ బస్సు యాత్ర చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ రాష్ట్రమంతా పర్యటించనున్నారు. పార్టీ ప్లీనరీ సమావేశంలో తన బస్సు యాత్రపై జగన్ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.
వైసీపీ ప్లీనరీ సమావేశాల ముగింపు సభలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మధ్యాహ్నం 2 గంటలకు మాట్లాడనున్నారు. సీఎం కొత్తగా ఏవైనా పథకాలను ప్రకటిస్తారా.? అసలు ఏం మాట్లాడుతారన్న దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.
రెండో రోజు ప్లీనరీలో వైసీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీ వాణి మాట్లాడుతూ.. ‘వైఎస్సార్ ఆశయాలను సీఎం జగన్ నెరవేర్చుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పారదర్శక పాలన సాగుతోంది.. పారదర్శక పాలనకు గ్రామ, వార్డు సచివాలయాలే నిదర్శనం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. మహానేత వైఎస్సార్ సంకల్పాన్ని వైఎస్ జగన్ నిజం చేసి చూపించారు’ అని చెప్పుకొచ్చారు.
వైసీపీ రెండో రోజు ప్లీనరీ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సభా స్థలికి చేరుకున్నారు. తల్లి విజయ్మతో కలిసి జగన్ సభా ప్రాంగణానికి వచ్చారు. ప్రాంగణానికి వచ్చి వెంటనే రాజ శేఖర్ రెడ్డి విగ్రహానికి నమస్కరించారు.
రెండో రోజు ప్లీనరీ సమావేశాలకు హాజరుకావడానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి ప్రారంభమయ్యారు. మరికాసేపట్లో ఆయన సభా ప్రాంగాణానికి చేరుకున్నారు. ఈ రోజు ముగింపు సభలో జగన్ ఏం మాట్లాడుతారన్న దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.
మంగళగిరిలో జరుగుతోన్న వైసీపీ రెండో రోజు ప్లీనరీ సమావేశ ప్రాంగణంలో వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ సాయి రెడ్డి మాట్లాడుతూ.. ‘ఈ రోజు సమావేశానికి 4.5 లక్షల మంది హాజరుకానున్నారు. చంద్రబాబు కుప్పంలోనే కాదు ఎక్కడ పోటీ చేసినా ఓడిపోతారు. ఈ సారి వైసీపీ రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ మైండ్ పోయి మాట్లాడుతున్నారు. అవినీతి తావులేకుండా నేరుగా లబ్ధిదారులకు సంక్షేమ ఫలితాలు అందుతుంటే ఆరోపణలు చేయడం దారుణం’ అని ప్రతిపక్షాలపై విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు.
వైసీపీ రెండో రోజు ప్లీనరీ సమావేశాలకు కార్యకర్తలు భారీ ఎత్తున వస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి కార్యకర్తలు, జగన్ అభిమానులు సభకు విచ్చేస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయడకుండా పోటెత్తుతున్నారు. శుక్రవారం 1.68 లక్షల మంది ప్లీనరీకి హాజరైనట్లు తెలుస్తోంది. ఇక ఈరోజు 2 లక్షల మంది సమావేశాలకు ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
వైపీసీ రెండో రోజు ప్లీనరీ సమావేశాలపై వర్షం ప్రభావం పడింది. శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షం కారణంగా.. ప్రధాన వేదిక, టెంట్లు మినహా ప్లీనరీ ప్రాంగణమంతా జలమయమైంది. వర్షం ధాటికి రెండు టెంట్లు పడిపోయాయి. దీంతో నిర్వాహకులు వెంటనే టెంట్లను తిరిగి ఏర్పాటు చేస్తున్నారు. ఇక వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వైసీపీ కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు.
వైసీపీ రెండో రోజు ప్లీనరీ సమావేశాల్లో భాగంగా ఐదు తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. పాలన-పారదర్శకత, సామాజిక సాధికారత, వ్యవసాయం, పరిశ్రమలు-ఎంఎస్ఎమ్ఈ-ప్రోత్సాహకాలు, ప్రభుత్వంపై దుష్ప్రచారం వంటి అంశాలపై ఈరోజు తీర్మానాలు చేయనున్నారు.