YSRCP Janaagraha Deekshalu: స్టేట్ వైడ్‌గా వైసీపీ జనాగ్రహ దీక్షలు కొనసాగుతున్నాయ్. సీఎం జగన్‌పై టీడీపీ లీడర్స్ చేస్తోన్న బూతు కామెంట్స్‌కు నిరసన తెలుపుతున్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్ తన సొంత నియోజకవర్గం భీమిలిలో దీక్ష చేపట్టారు. బూతులు తిట్టించడం, రెచ్చగొట్టడం… ఇదేనా నీ 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనుభవం అంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.
వైసీపీ జనాగ్రహ దీక్షల్లో వింతైన దృశ్యాలు కనిపించాయ్. నిరసన ప్రదర్శనల్లో ఎవరైనా ఏం చేస్తారు.. ర్యాలీ చేస్తారు.. నినాదాలు చేస్తారు. మహా అయితే దిష్టిబొమ్మ దగ్ధం చేస్తారు.. కానీ, వైసీపీ కార్యకర్తలు అంతకు మించి అన్నట్టు చేస్తున్నారు.
రాజమండ్రిలో ఎంపీ భరత్ జనాగ్రహ ర్యాలీ చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ లీడర్లు చేసిన బూతు కామెంట్స్‌పై తమ నిరసన తెలిపారు. అంతవరకు బాగానే ఉంది. కానీ, అసలు సీన్ ఇక్కడే మొదలైంది. చంద్రబాబుపై తమకున్న కోపాన్ని వెరైటీగా చూపించారు.
పప్పు కోసం పాకులాట.! దొంగ కోసం కీచులాట..! టీడీపీ అరాచకం… దేవుడా..! కుళ్లు, కుతంత్రాల రాజకీయాల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడండి… అంటూ చంద్రబాబు ఫొటోతో ఉన్న ఓ బ్యానర్‌పై తమ కోపాన్ని చూపించారు వైసీపీ కార్యకర్తలు.
చంద్రబాబు బ్యానర్‌ను ముందు చెప్పులతో కొట్టారు. తర్వాత చెప్పుల దండేశారు. అయినా వైసీపీ కార్యకర్తల కోపం చల్లారలేదు. కర్రలతో బ్యానర్‌ను చితకబాదేశారు. అయినా కసి తీరలేదు. చివరిగా బాబు బ్యానర్‌ని చింపేసి.. నేలకేసి కొట్టి..కాళ్లతో తొక్కేశారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్లాన్ ప్రకారమే ఆ పార్టీ నేత పట్టాభి సీఎం వైయస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. గొడవలు సృష్టించాలన్నదే చంద్రబాబు లక్ష్యమన్నారు. చంద్రబాబు వయస్సుకు తగ్గ ఆలోచనలు చేయడం లేదని విమర్శించారు. చంద్రబాబును చూసి ప్రజలు అసహ్యంచుకుంటున్నారని తెలిపారు.
సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో వైసీపీ నేతలు జనాగ్రహ దీక్షలు చేపట్టారు. బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం దగ్గర దీక్షలో కూర్చున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై టీడీపీ నేతల బూతు పురాణంపై నిరసన తెలుపుతున్నారు.
Read also: Black magic murder: విశాఖ ఏజెన్సీలో మూఢ నమ్మకం ఒక అమాయక ప్రాణాన్ని బలిగొంది