బాలకృష్ణ, లోకేష్ భారీగా భూములు కొన్నారు

రాజధాని ప్రకటనకు ముందే అమరావతిలో చంద్రబాబు తోపాటు నారా లోకేష్, బాలకృష్ణ, ప్రత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత సహా చాలా మంది టీడీపీ నేతలు భూములు కొనుగోలు చేశారన్నారు ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌

బాలకృష్ణ, లోకేష్ భారీగా భూములు కొన్నారు

Edited By:

Updated on: Sep 15, 2020 | 7:09 PM

రాజధాని ప్రకటనకు ముందే అమరావతిలో చంద్రబాబు తోపాటు నారా లోకేష్, బాలకృష్ణ, ప్రత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత సహా చాలా మంది టీడీపీ నేతలు భూములు కొనుగోలు చేశారన్నారు ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ నగరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా. చంద్రబాబుతో పాటు ఆయన బినామీలు అమరావతి రాజధాని ప్రాంతంలో వేల ఎకరాలు కొనుగోలు చేశారని.. చట్టాలను ఉల్లంఘించి భూములు కొన్న టీడీపీ నేతలు ఇప్పుడు జైలుకు వెళ్లక తప్పదన్నారు. రాజధాని పేరుతో టీడీపీ పెద్దలు అతిపెద్ద భూ కుంభకోణానికి పాల్పడ్డారని రోజా మంగళవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. ప్రతి కుంభకోణంలో స్టేలు తెచ్చుకోవడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని రోజా విమర్శించారు. ఇప్పుడు ఏసీబీ కేసులతో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని.. ఇకనైనా స్టేలు తెచ్చుకోకుండా చంద్రబాబు తన నిజాయితీని నిరూపించుకోవాలని రోజా కోరారు.

Loading...
Unable to load recommendations.
Follow Us