Perni Nani: ‘పనికొస్తారని భావిస్తేనే టికెట్‌ ఇస్తారు’.. వచ్చే ఎన్నికల్లో పోటీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు..

|

Dec 12, 2023 | 4:04 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా అధికార వైఎస్ఆర్‌సీపీ ఇప్పటికే సన్నాహాలను ప్రారంభించింది. వై నాట్ 175.. నినాదంతో వ్యూహాలకు పదునుపెడుతోంది. దీనిలో భాగంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పలు నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలను మార్చారు. మొత్తం 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జ్‌లను మార్చుతూ ఆదేశాలిచ్చారు.

Perni Nani: ‘పనికొస్తారని భావిస్తేనే టికెట్‌ ఇస్తారు’.. వచ్చే ఎన్నికల్లో పోటీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు..
Perni Nani
Follow us on

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా అధికార వైఎస్ఆర్‌సీపీ ఇప్పటికే సన్నాహాలను ప్రారంభించింది. వై నాట్ 175.. నినాదంతో వ్యూహాలకు పదునుపెడుతోంది. దీనిలో భాగంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పలు నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలను మార్చారు. మొత్తం 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జ్‌లను మార్చుతూ ఆదేశాలిచ్చారు. అన్ని నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్న జగన్.. మరోసారి అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. మార్పులు, చేర్పులన్నవి ప్రతీ రాజకీయ పార్టీలో సహజమని.. పార్టీకి మేలు చేసే నిర్ణయాన్ని నాయకత్వం తీసుకుంటుంది.. అంటూ పేర్ని నాని పేర్కొ్న్నారు. 175కి 175 గెలవాలనే లక్ష్యంతో జగన్‌ పనిచేస్తున్నారన్న పేర్ని నాని.. సర్వేలు, క్యాడర్‌ అభిప్రాయాల మేరకే మార్పులు జరిగాయని అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీలు, ఎమ్మెల్యే టికెట్లలో బీసీలకు ప్రాధాన్యం ఉంటుందని.. దాని ప్రకారం.. సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు.

ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని బందరు ఎమ్మెల్యే పేర్ని నాని స్పష్టం చేశారు. తన కుమారుడు పేర్ని కృష్ణమూర్తికి టికెట్‌ ఇవ్వాలని తాను ఇంత వరకు సీఎంను కోరలేదని అన్నారు. 175 స్థానాలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న సీఎం తన కుమారుడు ఆ 175లో పనికొస్తారని భావిస్తే టికెట్‌ ఇస్తారని అన్నారు. ఎవరికి టికెట్‌ ఇచ్చినా పార్టీ జెండా మోసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్ని నాని ప్రకటించారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..