CM Jagan Birthday: గ్రాండ్‌గా సీఎం జగన్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. అభిమానుల విషెస్ మామూలుగా లేవుగా..

|

Dec 21, 2022 | 9:51 AM

సీఎం జగన్‌కు డిఫరెంట్‌గా బర్త్‌డే విషెస్ చెబుతున్నారు వైసీపీ లీడర్స్‌. స్టేట్‌వైడ్‌గా గ్రాండ్‌ సెలబ్రేషన్స్‌ నిర్వహిస్తూ అభిమానం చాటుకుంటున్నారు. హ్యాపీ బర్త్‌డే సీఎం సార్‌ అంటూ ర్యాలీలు తీస్తున్నారు స్టూడెంట్స్‌.

CM Jagan Birthday: గ్రాండ్‌గా సీఎం జగన్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. అభిమానుల విషెస్ మామూలుగా లేవుగా..
Ys Jagan
Follow us on

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సీఎం వైఎస్‌ జగన్‌ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు వైసీపీ ఏర్పాట్లు చేసింది. వైఎస్ జగన్‌ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రక్తశిబిరాల నిర్వహణకు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బర్త్‌డేని వైసీపీ నేతలు, కార్యకర్తలు గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. స్టేట్‌ వైడ్‌గా పెద్దఎత్తున వేడుకలు నిర్వహిస్తున్నారు. రక్తదాన శిబిరాలు, అన్నదానం.. ఇలా పలు రకాల సేవా కార్యక్రమాలతో ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో సీఎం జగన్‌కు బర్త్‌డే విషెష్ చెబుతున్నారు. బాపట్ల జిల్లాలో వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరు వెంకట్‌రెడ్డి. వచ్చే ఎన్నికల్లో జగన్‌ లక్ష్యం నెరవేరాలంటూ 175/175 జగనన్న పేరుతో వరి పొలంలో పంటను కోయించి అభిమానాన్ని చాటుకున్నారు.

MLC తలశిల రఘురామ్‌ ఆధ్వర్యంలో ఆరు వందల కేజీల భారీ కేక్‌ను కట్‌చేసి సీఎం జగన్‌కు బర్త్‌డే విషెష్ చెప్పారు వైసీపీ లీడర్స్‌. విజయవాడ గొల్లపూడిలో డప్పు వాయిద్యాల మధ్య భారీ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం.. MLC తలశిల రఘురామ్‌, MLAలు వసంత వెంకటకృష్ణప్రసాద్‌, సామినేని ఉదయభాను, వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, ఎంపీ నందిగం సురేష్‌ కలిసి కేక్‌ను కట్‌ చేశారు.

నగరిలో సైతం జగనన్ పుట్టినరోజు సందడి ఆరంభమైంది. ఈ రోజు ఉదయం 9:30 నిముషాలకు వైసీపీ సెంట్రల్‌ ఆఫీస్‌లో సీఎం జగన్‌ బర్త్‌డే వేడుకలకు సర్వం సిద్ధమైంది. నగరి ఎంపీడీవో కార్యాలయంలో డ్వాక్రా సంఘాల మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

అరకు, రాజమండ్రిలోనూ ఘనంగా జగన్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ నిర్వహించారు. రాజమండ్రిలో 14వేల మంది విద్యార్ధులకు ఆల్‌ఇన్‌వన్‌ పుస్తకాలను పంపిణీ చేశారు. హ్యాపీ బర్త్‌డే సీఎం సార్‌ అంటూ కేరింతల మధ్య ర్యాలీ నిర్వహించారు స్టూడెంట్స్‌.

పులివెందులలో కడప ఎంపి అవినాష్ రెడ్డి సీఎం జగన్ పై రూపొందించిన పాటను ప్రారంభించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..