Malladi Vishnu: ‘సోము వీర్రాజుకు మతి ఉండి మాట్లాడుతున్నారా.? ఇలాంటి డెడ్ లైన్లు చాలా చూశాం’: వైసీపీ నేతలు

సోము వీర్రాజుకు మతి ఉండి మాట్లాడుతున్నారా.. లేదా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే మల్లాది విష్ణు. వాళ్ళకి ఎజెండా లేదు.. సిద్దాంతం లేదన్నారు.

Malladi Vishnu: సోము వీర్రాజుకు మతి ఉండి మాట్లాడుతున్నారా.? ఇలాంటి డెడ్ లైన్లు చాలా చూశాం: వైసీపీ నేతలు
Malladi

Updated on: Sep 05, 2021 | 1:37 PM

MLA Malladi Vishnu vs Somu Veerraju : సోము వీర్రాజుకు మతి ఉండి మాట్లాడుతున్నారా.. లేదా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే మల్లాది విష్ణు. వాళ్ళకి ఎజెండా లేదు.. సిద్దాంతం లేదన్నారు. డెడ్ లైన్లు చాలా చూసాం.. ప్రజల ఆరోగ్యం ముఖ్యమని అన్నారు. ఓట్లు ,సీట్లు లేని బీజేపీ మాట్లాడటం హాస్యాస్పదమనీ.. చవకబారు నీతిలేని రాజకీయాలు చేస్తోందనీ మండిపడ్డారు.

వైద్యులు సూచన మేరకే వినాయక చవితి ఉత్సవాలకు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అనుమతి ఇవ్వలేదన్నారు మల్లాది విష్ణు. థర్డ్ వేవ్ హెచ్చరికల కారణంగా.. ఇళ్లల్లోనే పండుగ చేసుకోవాలని చెప్పామన్నారు. ముస్లిం, క్రైస్తవులే కాదు.. ఎవరి పండగలైనా నిబంధనలు పాటించే చేసుకోవాలని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.

ఇలా ఉండగా, “ఏపీలో వినాయక ఉత్సవాలు జరుగుతాయి.. జరిపి తీరుతాం” అని స్పష్టం చేశారు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. చర్చ్‌, మసీదులో ప్రార్థనలు చేస్తే అరెస్ట్‌ చేస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ చర్యలకు భయపడే ప్రసక్తే లేదన్నారు.

Read also: Pregnant Lady: పురిటి నొప్పులతో విలవిల్లాడిన గర్భిణి, ఆస్పత్రికి తీసుకెళ్లే మార్గం లేక.. రైల్వే ట్రాక్‌పై తరలిస్తున్న వైనం