Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊరట.. ఆ కేసులో బెయిల్ మంజూరు!

వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊరట లభించింది. అంబటి రాంబాబు కస్టడీ పిటిషన్‌ను ఎక్సైజ్ కోర్టు కొట్టేసింది. అలాగే ఆయనకు షరత్తులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేలుతో పాటు రెండు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు పేర్కొంది. కాగా అంబటి రాంబాబు రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.

Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊరట.. ఆ కేసులో బెయిల్ మంజూరు!
Ambati Rambabu

Updated on: Feb 11, 2026 | 3:59 PM

మాజీ మంత్రి అంబటి రాంబాబుకి బెయిల్ మంజూరు అయింది. పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన కేసులో గుంటూరు కోర్టు అంబటి రాంబాబుకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చూసింది. రూ.10 వేలతో పాటు రెండు పూచీకత్తులు సమర్పించాలని అంబటి రాంబాబుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.అయితే ఈ సందర్భంగా అంబటి రాంబాబును కస్టడీకి కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది.

అయితే సీఎం చంద్రబాబును దూషించిన కేసులో ఇప్పటికే అంబటి రాంబాబుకు మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తాజాగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న కేసులో కూడా బెయిల్‌ రావడంతో అంబటి రాంబాబు రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం అంబటి రాంబాబు రాజమండ్రి జైలులో ఉన్నారు. బెయిల్ ప్రొసీజర్ పూర్తి కాగానే ఆయన జైలు నుంచి బయటకు రానున్నారు.

అయితే కోర్టులో బెయిల్‌ రాగానే మాజీ మంత్రి అంబటి రాంబాబు అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్‌లో నుంచి ఓ ట్వీట్ ప్రత్యక్షమైంది. దౌర్జన్యాలు, దాడులు, చెరసాలలు, వెలుగును బంధించలేవంటూ ఎక్స్ ఖాతాలో అంబటి అకౌంట్‌ నుంచి పోస్ట్ వచ్చింది. అయితే అంబటి కుటుంబ సభ్యులే ఈ ట్వీట్ చేసినట్లు ఉంటారని చర్చ నడుస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.