Andhra Pradesh: మూడున్నరేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పోవడం ఖాయం… ప్రెస్‌మీట్‌లో జగన్ సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పాలనతో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయని అరోపించారు. రాష్ట్రంలో రాజ్యాంగం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు జగన్‌. ప్రజలకు ఏ కష్టమొచ్చినా అండగా ఉండేది వైసీపీనేనని గుర్తు చేశారు. రైతుభరోసా నిధుల కోసం...

Andhra Pradesh: మూడున్నరేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పోవడం ఖాయం... ప్రెస్‌మీట్‌లో జగన్ సంచలన వ్యాఖ్యలు
Jagan Press Meet

Updated on: Jul 16, 2025 | 11:58 AM

రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పాలనతో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయని అరోపించారు. రాష్ట్రంలో రాజ్యాంగం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు జగన్‌. ప్రజలకు ఏ కష్టమొచ్చినా అండగా ఉండేది వైసీపీనేనని గుర్తు చేశారు. రైతుభరోసా నిధుల కోసం అన్నదాతకు అండగా ధర్నా చేశామన్నారు. కరెంట్‌ ఛార్జీల పెంపును నిరసిస్తూ పోరుబాట చేపట్టామని జగన్‌ చెప్పుకొచ్చారు. యువత పోరు పేరుతో ఆందోళనలు చేపట్టాం.. చంద్రబాబు మోసాలపై వెన్నుపోటు దినం నిర్వహించాం.. బాబు షూరిటీ-మోసం గ్యారంటీపై.. ప్రజలను చైతన్యవంతం చేస్తున్నామని వైఎస్ జగన్ అన్నారు.

వైసీపీని అణిచివేయాలని చంద్రబాబు కుట్రలు పన్నారని జగన్మోహన్‌ రెడ్ఇ ఆరోపించారు. అధికారులపై తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. డీజీ స్థాయి అధికారులనూ వేధిస్తున్నారని జగన్‌ ఆరోపించారు. మూడున్నరేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పోవడం ఖాయమని జగన్ జోస్యం చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం…

లైవ్ వీడియో చూడండి: