YS Vivekananda Reddy Murder Case: ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో సీబీఐ అధికారులు ఇప్పటికే పలు కీలక విషయాలను సేకరించారు. విచారణ నేపథ్యంలో.. సాక్షులకు భద్రత కల్పించాలని సీబీఐ కోరగా.. కడప కోర్టు (Kadapa District Court) ఈ ఆదేశాలను జారీ చేసింది. వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్ష్యులకు భద్రతను పెంచుతూ కడప ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. వివేకానంద రెడ్డి ఇంటి వాచ్‌మెన్‌గా పనిచేసిన రంగయ్యకు గన్‌మెన్‌తో కూడిన వన్ ప్లస్ వన్ భద్రత కల్పించాలని, అలాగే.. వివేకా వద్ద పనిచేసిన మాజీ డ్రైవర్ దస్తగిరికి వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ కల్పించాలని ఆదేశాలు జారీచేసింది. కాగా.. గత మూడు నెలలుగా వీరిరువురికీ పోలీసు భద్రత కల్పించినట్లు పోలీసులు కోర్టుకు వివరించారు. అయితే వారి భద్రత పర్యవేక్షణకు ఎస్ఐ స్థాయి అధికారిని నియమించి.. గన్‌మెన్లతో కూడిన భద్రత కల్పించాలని కోర్టు సూచించింది. దీంతో వారిద్దరికి వెంటనే భద్రతా ఏర్పాట్లను పోలీసులు కల్పించారు.
కాగా.. వివేకా హత్య కేసులో దోషులతో పాటు సాక్షులకు ప్రాణహాని ఉందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దీందోపాటు సాక్షుల భద్రతపై సీబీఐ అధికారులు సైతం వారికి భదత్ర కల్పించాలని కోర్టును కోరారు. దీనిపై నాలుగు రోజుల క్రితం విచారణ జరిపిన కడప కోర్టు.. సాక్షుల భద్రతపై పోలీసులను పలు ప్రశ్నలు సంధించింది. దీంతోపాటు సాక్షులకు సాయుధ దళాలతో కూడిన భద్రత ఇవ్వాలంటూ కోర్టు ఆదేశించింది.
Also Read: