ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసిన పోకిరీపై ఓ యువతి అపరకాళి అవతరామెత్తింది. ఆగ్రహంతో ఊగిపోతూ పొట్టు పొట్టు కొట్టింది. లవ్ చేయమని టార్చర్ చేసిన యువకుడి తాటతీశారు యువతి బంధువులు. ఎన్ని సంఘటలు జరుగుతున్నా, ఎన్ని చట్టాలు వచ్చినా శిక్షలు పడుతున్నా ఆకతాయిల వేధింపులకు అడ్డుకట్ట పడడం లేదు. అమ్మాయి కనిపిస్తే చాలు అన్నట్లు పోకిరీలు రెచ్చిపోతున్నారు. రోజురోజుకు ఆకతాయిల చేష్టలు మితిమీరుతున్నాయి. అమ్మాయిల వెంట పడి వేధించే వాళ్లకు తగిన గుణపాఠం చెబుతున్నా కొందరి బుద్ది మారడం లేదు.
తాజాగా అనంతపురం జిల్లా రాయదుర్గంలో ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడికి యువతి బంధువులు దేహశుద్ధి చేశారు. దాదాపీర్ అనే యువకుడు ఫోన్ రిపేర్ కోసం వచ్చిన యువతి ఫోన్ నంబర్ తీసుకుని.. ప్రేమిస్తున్నానని గత రెండు నెలలుగా వేధిస్తున్నాడు. దీంతో విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతి, బంధువులు కలిసి దుకాణం వద్దకు వచ్చి యువకుడికి దేహశుద్ధి చేశారు. తర్వాత పోలీసులకు అప్పగించారు.
ఫోన్‌లో వేధించడమేకాక ఆ యువతి… తనను ప్రేమిస్తుందని, వివాహం కూడా చేసుకోబోతున్నట్లు తప్పుడు ప్రచారం చేశాడని బాధితురాలు ఆరోపిస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..