
అమ్మ.. ఈ రెండు అక్షరాలే చాలు.. స్వార్థం లేని ప్రేమను చూపించేదే కేవలం అమ్మ మాత్రమే. కన్న బిడ్డల కోసం తల్లి చేసే త్యాగాల ముందు ఏవి సరిపోవు. అలా తనకు జీవితం ప్రసాదించిన తల్లి పట్ల కొందరు కర్కశత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. కంటికి రెప్పలా కాపాడిన తల్లినే కాటికి పంపుతున్నారు దుర్మార్గులు. ఓటు వేసే విషయంలో తలెత్తిన వివాదం.. కొడుకు తన తల్లిని హత్య చేసే దాకా వెళ్ళింది. ఈ విషాద సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.
కందూరు మండలం ఎగువపల్లికి చెందిన సంగమ్మ (45) తన కుటుంబతో కలిసి నివాసం ఉంటుంది. స్థానికంగా కూలీ పని చేసుకుంటూ కుటుంబంతో జీవనం సాగిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మంగళవారం(మే 14వ తేదీ) రాత్రి ఆమె దారుణ హత్యకు గురైంది. మే 13వ తేదీన జరిగిన ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ కు సంబంధించిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ వర్గీయులకు చెందిన ఆటోలో పోలింగ్ బూత్‌కు వెళ్లింది. దీంతో వైసీపీకేఓటు వేసి ఉంటుందన్న అనుమానంతో సుంగమ్మతో కుమారుడు వెంకటేశ్ అనుమానించి గొడవకు దిగాడు.
ఈ క్రమంలోనే మే 14వ తేదీన రాత్రి తల్లితో వెంకటేశ్ వాగ్వాదానికి దిగాడు. తనకు తెలియకుండా ఫ్యాన్ గుర్తుకు ఓటు ఎందుకు వేశావని నిలదీశాడు. ఆవేశంతో వెంకటేష్ తల్లిపై సుత్తితో దాడి చేశాడు. ఆమె అక్కడికక్కడే మృతి చెందడంతో సంఘటన స్థలం నుండి నిందితుడు పారిపోయాడు. ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించడంతో వెంకటేష్‌పై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఎగువపల్లి గ్రామంలో జరిగిన ఈ విషాదకర ఘటన స్థానికులను కలచివేసింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…