vijayasai reddy on pawan kalyan: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక సందర్భంగా ప్రధాన పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి అధిపతి అవతాడు అని మోదీ చెప్పిన మాటలను సోము వీర్రాజు మీడియా ద్వారా వెల్లడించారు. అయితే, ఇందుకు వైసీపీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. ఇదే విషయం పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
జరుగుతున్నది తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నిక అని వ్యాఖ్యానించారు. అయితే కాబోయే సీఎం ఫలానా అంటూ బిస్కెట్ వేయడం కాక మరేమిటి అంటూ ఎద్దేవా చేశారు. ఆఫర్ చేసే పార్టీకి రాష్ట్రంలో ఒక్క సీటు లేదు అని, దానిని తీసుకొనే పార్టీకి ఉనికి లేదంటూ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా సెటైర్స్ వేశారు. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట అంటూ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే కూడా కానివాడు ఏకంగా సీఎం కుర్చీ ఎక్కుతాడట అంటూ చెప్పుకొచ్చారు. అయితే, ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకి నెటిజన్లు స్పందిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాక గతంలో విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు.
జరుగుతున్నది తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నిక. కాబోయే సీఎం ఫలానా అంటూ బిస్కట్ వేయడం కాక మరేమిటి? ఆఫర్ చేసే పార్టీకి రాష్ట్రంలో ఒక్క సీటు లేదు. దానిని తీసుకునే పార్టీకి ఉనికి లేదు. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందట. కనీసం ఎమ్మెల్యే కూడా కాని వాడు ఏకంగా సీఎం కుర్చీ ఎక్కుతాడట!
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 31, 2021
Read Also…
Mahesh Babu Dupe: పిల్లలకు పాలు కొనలేని దీనస్థితిలో మహేష్ బాబు డూప్.. పని ఇచ్చి ఆదుకోమంటూ వినతి