లిక్కర్‌స్కామ్‌లో మిథున్‌ రెడ్డి కుటుంబాన్ని ఇరికించింది విజయసాయిరెడ్డినా? మాస్టర్‌ మైండ్‌ ఎవరు?

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఇది రాజకీయంగా తనను లక్ష్యంగా చేసుకున్న కక్ష సాధింపేనని ఆయన అన్నారు. తనపై వేల కోట్ల రూపాయల స్కామ్ ఆరోపణలకు ఒక్క రూపాయి సాక్ష్యమైనా చూపాలని సిట్‌కు, ఈడీకి సవాల్ విసిరారు. ఎలాంటి అక్రమ లావాదేవీలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు.

Updated on: Apr 11, 2026 | 8:21 PM

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనదని, తనను లక్ష్యంగా చేసుకుని అక్రమంగా ఇరికించే ప్రయత్నం జరుగుతోందని ఆయన తెలిపారు. వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఆరోపిస్తున్న వారు, తన డిక్లేర్డ్ ఆస్తులు కాకుండా ఒక్క రూపాయి అక్రమ సంపాదనను చూపాలని సిట్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులకు సవాల్ విసిరారు. అంతేకాకుండా టీవీ9 మేనేజింగ్‌ ఎడిటర్‌ రజినీకాంత్‌కు ఇచ్చిన క్రాస్‌ఫైర్‌లో మిథున్‌ రెడ్డి లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి ఆసక్తికర అంశాలు వెల్లడించారు.

తన కంపెనీ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ కు అరబిందో నుంచి వచ్చిన ఐదు కోట్ల రూపాయల లావాదేవీ చట్టబద్ధమైన కాంట్రాక్టుకు సంబంధించినదని, లిక్కర్ స్కామ్‌తో సంబంధం లేదని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ లావాదేవీలో ఎలాంటి లాభం లేదని, ఆదాయపు పన్ను రికార్డులలో దీనిని చూపించారని ఆయన వివరించారు. తనపై గతంలోనూ రాజకీయ కేసులు పెట్టారని, తన కుటుంబం రాజకీయాలపై ఆధారపడి జీవించడం లేదని, వారి వ్యాపారాలు ఉన్నాయని హూరూన్ నివేదికను ఉటంకిస్తూ పేర్కొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us