YCP MLA STAGE PROTEST: జాయింట్ కలెక్టర్ తీరుపై ఎమ్మెల్యే గుస్సా.. వైద్యులతో కలిసి ధర్నాకు దిగిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి..

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కోపం వచ్చింది. వైద్యుల పట్ల నిర్లక్ష్య వైఖరి చూపుతున్నారంటూ జిల్లా అధికార యంత్రాంగానికి..

YCP MLA STAGE PROTEST: జాయింట్ కలెక్టర్ తీరుపై ఎమ్మెల్యే గుస్సా.. వైద్యులతో కలిసి ధర్నాకు దిగిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి..

Updated on: Dec 19, 2020 | 1:03 PM

YCP MLA STAGE PROTEST: వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కోపం వచ్చింది. వైద్యుల పట్ల నిర్లక్ష్య వైఖరి చూపుతున్నారంటూ జిల్లా అధికార యంత్రాంగానికి వ్యతిరేకంగా ఆయన ఆందోళనకు దిగారు. శనివారం నాడు నెల్లూరు జీజీహెచ్ ఆస్పత్రి వద్ద వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్లు ధర్నా చేపట్టారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన శ్రీధర్ రెడ్డి.. రాష్ట్రంలో కరోనాపై పోరాటంలో నెల్లూరు జిల్లా మొదటి స్థానంలో నిలిచిందన్నారు. కష్టపడి విధులు నిర్వహించిన వైద్య సిబ్బందికి వేతనాలు చెల్లించడంలో నిర్లక్ష్యం వహించడం దారుణం అన్నారు. నెల్లూరు జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్లిప్త వైఖరి కారణంగా వైద్య సిబ్బందికి వేతనాలు అందక వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తనకు ఒక మాట చెబుతూ.. వైద్యులతో ఒకలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ప్రభాకర్ రెడ్డి వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. వేతనాల విషయమై రెండు సార్లు కలిసి మాట్లాడినా జేసీ మీనమేషాలు లెక్కిస్తున్నారని ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. ఈ కారణంగానే 24 గంటల నిరవధిక నిరసనకు దిగానని శ్రీధర్ రెడ్డి చెప్పారు. అయితే, తన దీక్ష ప్రకటనపై పార్టీ అధిష్టానం స్పందించి హామీ ఇచ్చిన నేపథ్యంలో ధర్నాను రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. సోమవారం లోగా సమస్య పరిష్కారం కాకపోతే వైద్య సిబ్బందితో కలిసి ఉద్యమం చేపడతానని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

ఇదిలాఉండగా, కోవిడ్ విధులు నిర్వహించిన తమకు వేతనాలు చెల్లించాలని వైద్యులు డిమాండ్ చేశారు. ఆయుష్ వైద్యులకు అన్ని జిల్లాల్లో రూ.70వేల వేతనం ఇస్తుంటే నెల్లూరు జిల్లాలో రూ.50 వేలు మాత్రమే ఇస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి మొండితనం వల్లే వేతనాలు చెల్లించడం లేదని వైద్య సిబ్బంది ఆరోపిస్తున్నారు.

 

Also read:

ఆదిలాబాద్‌ తాడిగూడలో హైటెన్షన్.. భయటకొచ్చేందుకు జంకుతున్న ప్రజలు.. పోలీసుల భారీ బందోబస్త్..

Indian Army Forces: ఇండియన్ ఆర్మీలో ఎయిర్‌ఫోర్స్ ఎంతో కీలకం.. వాయుసేన సేవలు అనిర్వచనీయం.. ట్రైనీ పైలట్ల పరేడ్‌లో రాజ్‌నాథ్..