DL Ravindra Reddy: YCPకి ఇంకా రాజీనామా చేయలేదన్నారు మాజీ మంత్రి DL రవీంద్రారెడ్డి. కానీ ఎన్నికలకు 6 నెలల ముందు ఏ పార్టీ నుంచి పోటా చేస్తానో చెప్తానన్నారు. అటు మంత్రి బాలినేనిపైనా విమర్శలు గుప్పించారు. విద్యుత్ శాఖ మంత్రి బాలినేని ఏనాడైనా విద్యుచ్ఛక్తి పై సమీక్ష చేశారా అని ఇవాళ కడపలో డీఎల్ నిలదీశారు. “ఏ రాజకీయ పార్టీ రాష్ట్ర ప్రగతికి తోడ్పడుతుందో ఆ రాజకీయ పార్టీలో చేరి పోటీ చేస్తాను. ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గానైనా పోటీ చేస్తా.” అని డీఎల్ స్పష్టం చేశారు.
“విద్యుత్ మంత్రి ఉన్నాడా లేడా అనే ఆలోచన వస్తుంది. విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఏనాడైనా విద్యుత్ శక్తి శాఖ పై సమీక్ష చేశారా. ప్రస్తుతం వైసీపీలోనే కొనసాగుతున్నాను. రాజీనామా చేయలేదు. జూదం ఆడుకునేందుకు రష్యాకు వెళ్లే బాలినేని శ్రీనివాస్ రెడ్డికి నా గురించి విమర్శించే అర్హత లేదు. ఇప్పటికైనా బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలివి తెచ్చుకుని తన శాఖల మీద పట్టు సాధించాలి. రాజశేఖర్ రెడ్డి బంధువులని టికెట్లు తెచ్చుకుని తానేమీ బతకలేదు.” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు డీఎల్.