YCP Bus Yatra: వైసీపీ మంత్రుల బస్సు యాత్ర ఇవాళ మూడో రోజుకు చేరుకుంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమై.. 10.00 గంటలకు నారాయణపురం.. 10.45 కు ఏలూరు బైపాస్ మీదుగా 11.30 కి గన్నవరం చేరుకుంటుంది. 12.15కు విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు మంగళగిరి వరకు యాత్ర సాగనుంది. అనంతరం మధ్యాహ్నం 1.30కి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మంత్రులంతా లంచ్ చేయనున్నారు. మధ్నాహ్నం మూడు గంటలకు యాత్ర తిరిగి ప్రారంభం కానుంది. 3.15కి గుంటూరు బైపాస్ మీదుగా 4 గంటలకు చిలకలూరిపేట చేరుకుంటుంది. సాయంత్రం 4.30 నర్సరావుపేటలో మంత్రులు బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీంతో ఈరోజు యాత్ర ముగియనుంది.
కాగా, ఈ యాత్రలో మంత్రులు మాట్లాడుతూ, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న విమర్శలను దీటుగా తిప్పికొట్టారు. మంత్రి ధర్మాన మాట్లాడుూ, సామాజిక న్యాయం కోసం దశాబ్దాలుగా, శతాబ్దాలుగా యుద్ధాలు జరిగాయన్నారు. అలాంటివేం లేకుండా సామాజిక న్యాయమేంటే చూపిన ఘనుడు సీఎం జగన్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.
మరో మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీలకు విద్య, ఆరోగ్యం, గౌరవం, గుర్తింపు, రక్షణ, స్వేచ్ఛ దక్కితేనే సమసమాజస్థాపన అని, అది మూడేళ్ల జగనన్న పాలనలో సాకారమైందని పేర్కొన్నారు.
ఉత్తరాంధ్ర నుంచి మొదలైనా వైసీపీ మంత్రుల ఈ బస్సు యాత్ర.. ఈనెల 29న అనంతపురంలో ముగియనుంది.