AP News: అంజు యాదవ్ జోలికొస్తే పవన్ కళ్యాణ్ తాట తీస్తాం – యాదవ సంఘం నేతలు

ఆంధ్రప్రదేశ్‌లో మహిళా పోలీస్ అధికారణి అంజు యాదవ్ పేరు ఇప్పుడు మారుమోగిపోతుంది. తొలి నుంచి వివాదాస్పద ధోరణి ఉన్న ఆమె.. తాజాగా జనసేన నేతపై దాడి చేసి వార్తల్లోకి ఎక్కింది. ఆమె జనసేన నేత చెంపలు వాయించిన వీడియో ప్రజంట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

AP News: అంజు యాదవ్ జోలికొస్తే పవన్ కళ్యాణ్ తాట తీస్తాం - యాదవ సంఘం నేతలు
Pawan Kalyan

Updated on: Jul 17, 2023 | 3:32 PM

Srikalahasti, 17th July: జనసేన స్థానిక నేత కొట్టే సాయిపై శ్రీకాళహస్తి పట్టణ సీఐ అంజు యాదవ్ దాడి చేయడాన్ని ఆ పార్టీ సీరియస్‌గా తీసుకుంది. ఏకంగా పార్టీ అధ్యక్షుడు పవన్ కదలివచ్చి.. జిల్లా ఎస్పీకి సీఐపై ఫిర్యాదు చేశారు. కార్యకర్తలు తప్పు చేయకున్నా దాడి చేశారని.. సీఐపై చర్యలు తీసుకోవాలని కోరారు పవన్‌కల్యాణ్. తాజాగా ఈ ఘటన మరో టర్న్ తీసుకుంది. సీఐ అంజు యాదవ్‌పై పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ యాదవ సంఘం నేతలు ఫైరయ్యారు. బీసీ మహిళ అయిన అంజు యాదవ్ జోలికొస్తే పవన్ కళ్యాణ్ తాట తీస్తామంటూ ఘాటుగా హెచ్చరించారు. కానిస్టేబుల్ కొడుకుని అని పదే, పదే చెప్పే పవన్.. కష్టపడి సీఐ స్థాయికి ఎదిగిన అంజు యాదవ్ పట్ల వ్యవహరిస్తున్న తీరు దారుణమన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చింతమనేని ప్రభాకర్.. వనజాక్షిపై దాడి చేసినప్పుడు పవన్ గొంతు మూగబోయిందా అని యాదవ సంఘం నేతలు ప్రశ్నించారు. అంజు యాదవ్ ఏ తప్పు చేయలేదని.. రోడ్డుపై ధర్నా చేయడం వల్ల స్థానికులకు ఇబ్బంది కలగడంతో..  వృత్తి ప్రకారమే ముందుకు వెళ్లారని పేర్కొన్నారు.

కాగా అంతకముందు  రేణుగుంట ఎయిర్ పోర్ట్ నుంచి తిరుపతి సుమారు 15కిలోమీటర్లు పైగా పవన్ ర్యాలీ చేశారు. భారీ ర్యాలీలో పార్టీ నేతలు, అభిమానులు పాల్గొన్నారు. ఘజమాలలతో పవన్‌కు ఘన స్వాగతం లభించింది. ర్యాలీలో పవన్ అభిమాని వినూత్నంగా స్వాగతం పలికాడు. రోప్‌ సాయంతో గాలిలో వేలాడుతూ స్వయంగానే పవన్ కు పూలమాల వేసి గ్రాండ్ వెల్‌కల్ పలికాడు. పవన్‌పై ఎనలేని, ఆకాశమంత అభిమానాన్ని చాటుకున్నాడు. పవన్ ర్యాలీలో..మరోవినూత్న ఘటన చోటుచేసుకుంది. పవన్‌ కుప్పం రావాలి అంటూ బ్యానర్ ప్రదర్శించారు పార్టీ కార్యకర్తలు, అభిమానులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..